మాకు, వాళ్లకు మధ్య చిచ్చు పెట్టే కుట్ర... ఆ వార్తలపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య చిచ్చు పెట్టే కుట్ర జరుగుతోందని రాష్ట్ర సర్కారు అభిప్రాయపడుతోంది.

news18-telugu
Updated: August 15, 2020, 3:21 PM IST
మాకు, వాళ్లకు మధ్య చిచ్చు పెట్టే కుట్ర... ఆ వార్తలపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం...
సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య చిచ్చు పెట్టే కుట్ర జరుగుతోందని రాష్ట్ర సర్కారు అభిప్రాయపడుతోంది. ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య దూరం పెంచే ప్రయత్నం జరుగుతోందని భావిస్తోంది. న్యాయ వ్యవస్థ మీద నిఘా వార్తలపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరహా వార్తల ప్రసారం, ప్రచురణపై ప్రభుత్వం న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ల మీద ప్రభుత్వం నిఘా పెడుతోందని, వారి ఫోన్లను ట్యాప్ చేస్తోందంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో ఓ వార్త ప్రచురితమైంది. ఈ వార్త మీద ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య, నియంత్రణ మండలి చైర్మన్ మాజీ జస్టిస్ ఈశ్వరయ్య న్యాయవ్యవస్థ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ ఆడియో టేప్ బయటకు వచ్చింది. అది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానల్లో ప్రసారం అయింది. న్యాయ మూర్తుల మీద కూడా జస్టిస్ ఈశ్వరయ్య అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఇటీవల నిజ నిర్ధారణ కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో జ్యుడిషియల్ విచారణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఫిర్యాదు దారు అయిన మరో జడ్జి రామకృష్ణను తన వద్ద ఉన్న సాక్ష్యాలను విచారణలో అందించాలని, ఇందుకు అవసరమైతే సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ అధికారులు సహకరించాలని సూచించింది. ఏపీ హైకోర్టు ఉన్న ప్రాంతాన్ని కరోనా కేసుల దృష్ట్యా రెడ్‌జోన్‌గా ప్రకటించాలని, కరోనా ప్రబలుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ జస్టిస్ ఈశ్వరయ్య న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టుతో పాటు రాష్ట్రపతికీ లేఖలు రాశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 15, 2020, 2:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading