Home /News /politics /

SOME TDP LEADERS PREFER CHANDRABABU LEADERSHIP FOR 2024 ELECTIONS AK

Chandrababu Naidu: మళ్లీ చంద్రబాబు.. లోకేశ్ ఇప్పుడే వద్దు.. టీడీపీలో భిన్నాభిప్రాయాలు

లోకేశ్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

లోకేశ్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

Chandrababu Naidu: లోకేశ్ నాయకత్వాన్ని పార్టీలో ఎవరూ వ్యతిరేకించకపోయినప్పటికీ.. ఇప్పటికిప్పుడు సీఎం జగన్‌కు పోటీగా లోకేశ్‌ను ప్రొజెక్ట్ చేయడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయంతో పలువురు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.

    ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీ ఆధిపత్యం కొనసాగుతోంది. మరోవైపు ప్రతిపక్షం టీడీపీ ఇంకా బలం పుంజుకోలేకపోతోందనే వాదన కూడా ఉంది. ఇదే ఏపీలో వైసీపీ, టీడీపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనే జనసేన ప్రయత్నాలు ఎంతవరకు పెద్దగా ఫలిస్తాయన్న దానిపై సందేహాలు నెలకొన్నాయి. క్షేత్రస్థాయిలో బలంగా లేని ఈ రెండు పార్టీలు.. వైసీపీ, టీడీపీలకు ధీటుగా ఎదగడం అంత సులభం కాదనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొని మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న టీడీపీ(Telugu Desam Party) .. ఇందుకోసం ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనే అంశంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో ఏపీలోని అధికార వైసీపీని టీడీపీ చంద్రబాబు (Chandrababu Naidu) సారథ్యంలోనే ఎదుర్కొంటుందా ? లేక ఆయన కుమారుడు లోకేశ్ (Nara Lokesh) సారథ్యంలో ఎదుర్కొంటుందా ? అనే అంశంపై ఆ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.

    కొందరు వచ్చే ఎన్నికల నాటికి సీఎం జగన్‌కు ధీటుగా నారా లోకేశ్‌ను తయారు చేయాలని టీడీపీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే కొందరు సీనియర్ నాయకులు మాత్రం లోకేశ్‌ రాజకీయంగా ఎదిగేందుకు ఇంకా సమయం ఉందని.. వచ్చే ఎన్నికల్లోనూ చంద్రబాబు సారథ్యంలోనూ పార్టీ ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆ పార్టీ సీనియర్ నేత, ఇటీవల పార్టీ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన గోరంట్ల బుచ్చయ్య ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    కానీ కొందరు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారనే చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతోంది. లోకేశ్ నాయకత్వాన్ని పార్టీలో ఎవరూ వ్యతిరేకించకపోయినప్పటికీ.. ఇప్పటికిప్పుడు సీఎం జగన్‌కు పోటీగా లోకేశ్‌ను ప్రొజెక్ట్ చేయడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయంతో పలువురు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.

    Maa Elections 2021: మా ఎన్నికల ఎఫెక్ట్.. ఆ నినాదం ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఉంటుందా ?

    YS Jagan: జగన్‌ను టెన్షన్ పెడుతున్న వైఎస్ఆర్ సన్నిహితుడు.. వైసీపీలో టెన్షన్

    పార్టీకి యువరక్తం కావాలని కొందరు నేతలు పదే పదే కొత్త చర్చను తెరపైకి తీసుకొస్తున్నారని.. కానీ రాష్ట్ర ప్రజలకు ఇంకా చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం ఉందనే విషయాన్ని కొందరు నేతలు విస్మరిస్తున్నారని సీనియర్ నేతలు కూడా వాదిస్తున్నారు. గతంలోనూ చంద్రబాబుపై ఈ రకమైన ప్రచారం జరిగిందని.. కానీ మళ్లీ ఆయన సారథ్యంలోనే టీడీపీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎవరి సారథ్యంలో ముందుకు సాగుతుందన్న అంశంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu naidu, Nara Lokesh, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు