‘కాంగ్రెస్‌లోకి టీఆర్ఎస్ నేతలు’... ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో 12 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నుంచి పెద్ద నేతలు తమతో టచ్‌లో ఉన్నారని... వారు త్వరలోనే తమ పార్టీలో చేరతారని వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: October 12, 2018, 8:42 PM IST
‘కాంగ్రెస్‌లోకి టీఆర్ఎస్ నేతలు’... ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
పార్టీలోని ఇతర నేతలతో ఉత్తమ్(Image: Facebook)
news18-telugu
Updated: October 12, 2018, 8:42 PM IST
తమకున్న సర్వే రిపోర్టుల ప్రకారం వచ్చే ఎన్నికల్లో మహాకూటమి 80 స్థానాలకు పైగా కైవసం చేసుకోబోతోందని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ 20 సీట్లకే పరిమితమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన అనేక మంది పెద్ద నేతలు తమతో టచ్‌లో ఉన్నారని ఉత్తమ్... వారు త్వరలోనే కాంగ్రెస్‌లోకి రాబోతున్నారని తెలిపారు.

టీఆర్ఎస్ నేతలు ఆశల పల్లకిలో తేలుతున్నారని... ఆ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి టీఆర్ఎస్ ఎందుకు మద్దతిచ్చిందని ప్రశ్నించారు.

తెలంగాణవ్యాప్తంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో 12 భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయబోతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మహాకూటమి పేరులో మార్పు ఉంటుందని తెలిపిన ఆయన... రెండు మూడు రోజుల్లో దానిపై స్పష్టత వస్తుందని తెలిపారు. తాము ఇవ్వబోయే హామీలను అన్ని పార్టీలతో కలిసి చర్చిస్తామని అన్నారు. మహాకూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో డ్రాఫ్ట్ రెడీ అయ్యిందనీ, అభ్యర్థుల టికెట్ల విషయం ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు.

తమ పార్టీ గెలిచే అవకాశం, సామాజిక న్యాయం ప్రాతిపదికగా టికెట్ల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ అనే అంశం హైకమాండ్ పరిశీలనలో ఉందన్న ఉత్తమ్... కోదండరాంతోచర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. టీజేఎస్‌కు ఎన్ని సీట్లు కేటాయిస్తారనే అంశంపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని అన్నారు.First published: October 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...