TDP-Janasena: టీడీపీ నేతలను టెన్షన్ పెడుతున్న జనసేన.. అలా జరుగుతుందా ?

చంద్రబాబు-పవన్

Andhra Pradesh: 2014లో టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చినప్పటికీ.. ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. దీంతో టీడీపీ నేతలు మెజార్టీ స్థానాల్లో పోటీ చేశారు.

  • Share this:
    రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అందుకు రాజకీయాల నేతల మధ్య మిత్రబంధం, పార్టీల మధ్య పొత్తులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఏపీ(Andhra Pradesh) రాజకీయాల్లోనూ రాబోయే ఎన్నికల్లో కొత్త పొత్తులు ఉంటాయనే చర్చ గత కొంతకాలంగా సాగుతోంది. ఒకప్పుడు ఎన్నికల కోసం కలిసిన టీడీపీ, జనసేన మరోసారి కలవబోతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీతో రాజకీయ స్నేహం చేస్తున్న జనసేన(Janasena).. వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ వాదనను బీజేపీ నేతలు ఖండిస్తున్నా.. జనసేన నేతలు మాత్రం ఈ ప్రచారంపై నోరు విప్పడం లేదు. అయితే జనసేన వచ్చే ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు టీడీపీ(TDP) నేతలకు సంతోషంతో పాటు ఆందోళన కూడా కలిగిస్తోందనే టాక్ ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది.

    జనసేన మళ్లీ టీడీపీతో కలిస్తే ఆ పార్టీ ఓటు బ్యాంకు కూడా టీడీపీకి కలిసొస్తుంది. దీని వల్ల వచ్చే ఎన్నికల్లో తాము వైసీపీని సమర్థవంతంగా ఢీ కొట్టవచ్చన్నది టీడీపీ నేతల భావన. ఇంతవరకు బాగానే ఉన్నా.. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే.. తమ పరిస్థితి ఏమవుతుందో అనే టెన్షన్ కొందరు టీడీపీ నేతల్లో అప్పుడే మొదలైందని చర్చ సాగుతోంది. 2014లో టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చినప్పటికీ.. ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. దీంతో టీడీపీ నేతలు మెజార్టీ స్థానాల్లో పోటీ చేశారు.

    కానీ.. గత ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతోంది. దీంతో టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటే.. సీట్ల పంపకం లెక్క తెరపైకి వస్తుంది. మాకు ఎన్ని సీట్లు ఇస్తారనే అంశం జనసేన టీడీపీ ముందు పెడుతుంది. గతంలో మాదిరి కాకుండా పూర్తిస్థాయి రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఈసారి ఎక్కువ సీట్లు కావాలని కోరే ఛాన్స్ ఉంది.

    అందులోనూ కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండి, జనసేన ప్రభావం చూపించే గోదావరి జిల్లాల్లోని సీట్లను జనసేన ఎక్కువగా కోరవచ్చని సమాచారం. ఈ విషయం ఇప్పటికే గోదావరి జిల్లాల నేతలను టెన్షన్ పెడుతోందని టాక్. నియోజకవర్గంలో పోటీ చేయబోయేది తామే అని అనుకుంటున్న నేతలు.. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరితే.. ఆ సీటు జనసేనకు వెళ్లిపోతుందేమో అని ఆందోళన చెందుతున్నారట.

    Maa Elections 2021: మా ఎన్నికల ఎఫెక్ట్.. ఆ నినాదం ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఉంటుందా ?

    YS Jagan: జగన్‌ను టెన్షన్ పెడుతున్న వైఎస్ఆర్ సన్నిహితుడు.. వైసీపీలో టెన్షన్

    మరోవైపు ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఏయే సీట్లలో తాము పోటీ చేయాలనే విషయంపై జనసేన కూడా ఓ సర్వే చేపడుతోందని సమాచారం. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో జనసేన తమతో కలిసి వస్తుందనే ఆశాభావం ఒకవైపు.. అలా జరిగితే తమ సీట్లు ఎక్కడ పోతాయో అనే ఆందోళన మరోవైపు తెలుగు తమ్ముళ్లలో ఉన్నాయని ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ మొదలైంది.
    Published by:Kishore Akkaladevi
    First published: