కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందా.. కుప్పకూలుతుందా అన్నది నేటితో తేలిపోయే అవకాశం ఉంది. గురువారం అసెంబ్లీలో సీఎం కుమారస్వామి విశ్వాస పరీక్షకు
తీర్మానం ప్రవేశపెట్టారు.స్పీకర్ రమేశ్ కుమార్ దానిపై చర్చ చేపట్టగా.. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో స్పీకర్ గందరగోళ సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. విశ్వాస తీర్మానంపై మధ్యాహ్నం తర్వాత చర్చ కొనసాగనుంది. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం కుమారస్వామి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం కొనసాగుతుందా? లేదా అన్న దాని కోసం తాను అసెంబ్లీకి రాలేదని చెప్పారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. కొంతమంది ఎమ్మెల్యేల కారణంగా స్పీకర్ స్థానం కూడా ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొందన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు తన పాలన పట్ల సంతృప్తిగానే ఉన్నారని.. కొంతమందికి వ్యతిరేకత ఉంటే ఉండవచ్చు గానీ.. తనకు మాత్రం ఆత్మగౌరవం ఉందన్నారు.
మాజీ సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ.. 1967 వరకు రాజకీయాల్లో ఫిరాయింపులు లేవని గుర్తుచేశారు. అప్పట్లో హర్యానాకు చెందిన గయా లాల్ అనే ఎమ్మెల్యే ఒకేరోజు 3 పార్టీలు మారడంతో ఈ పరంపర మొదలైందన్నారు. ఫిరాయింపుల సీరియస్‌గా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత రాజకీయవేత్త మధు దందావతే చెప్పినట్టు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రక్షాళన చేయడమే మహాత్మాగాంధీకి మనమిచ్చే అసలైన నివాళి అన్నారు. ఫిరాయింపు వ్యతిరేక చట్టం ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుందన్నారు.
విశ్వాస తీర్మానం సందర్భంగా బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్ సభకు రాకపోవడం గమనార్హం.ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు సహా 13 మంది రెబల్ ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉన్నారు. దీంతో మొత్తం 225 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్-జేడీఎస్ సంఖ్యా బలం 102కి పడిపోయింది. అటు బీజేపీకి 107 సభ్యుల బలం ఉంది. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే.. మేజిక్ ఫిగర్ 105కి పడిపోతుంది. అప్పుడు బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తుంది.
బలపరీక్ష త్వరగా పూర్తి చేయండి : యడ్యూరప్ప
అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత బీఎస్ యడ్యూరప్ప మాట్లాడుతూ.. విశ్వాస తీర్మానానికి సంబంధించిన పరీక్షను ఒకే రోజులో పూర్తి చేయాలని స్పీకర్ రమేష్ కుమార్‌ను కోరారు. గతంలో విశ్వాస పరీక్షను ఒకేరోజులో పూర్తి చేసిన సందర్భాన్ని ఉదహరించారు. ఇరు పక్షాల నేతలకు సమయమిచ్చి బలపరీక్ష నిర్వహించాలని కోరారు. అయితే రూల్ 164 ఇందుకు వర్తించదని తెలిపారు. హౌజ్‌లో జరిగే ప్రొసీడింగ్స్‌లో బాధ్యతగా పాల్గొనాలని సూచించారు.
#Karnataka CM HD Kumaraswamy in Vidhana Soudha, Bengaluru: I haven't come just because there is a question on whether I can run a coalition government or not. Events have shown that even the role of the Speaker has been put under jeopardy by some legislators. pic.twitter.com/lgFPBkcYVc
— ANI (@ANI) July 18, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dk shivakumar, Hd kumaraswamy, Karnataka political crisis