జనసేన నుంచి కీలక నేతను వెళ్లగొట్టే ప్రయత్నం...

ఎన్నికలకు ముందు చాలా మంది నేతలు జనసేనలో చేరి.. ఎన్నికల్లో ఓటమి తర్వాత వెళ్లిపోయారు. అయితే, చేరినప్పటి నుంచి కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నారు నాదెండ్ల మనోహర్.

news18-telugu
Updated: October 18, 2019, 3:20 PM IST
జనసేన నుంచి కీలక నేతను వెళ్లగొట్టే ప్రయత్నం...
పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్
  • Share this:
జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత ముఖ్యమైన నేతలు ఎవరంటే.. ఆయన అభిమానులకి కూడా పేర్లు తెలియవు. కొందరు సీనియర్ నేతలు ఉన్నా.. వారి పేర్లు ప్రజలకు తెలియవు. అయితే, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తర్వాత ఆ పార్టీలో కొద్దోగొప్పో తెలిసిన వ్యక్తి ఒక్కరే. ఆయనే నాదెండ్ల మనోహర్. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. పరిపాలనాపరమైన అంశాల్లో అవగాహన ఉన్న నేత. ఎన్నికలకు ముందు చాలా మంది నేతలు జనసేనలో చేరి.. ఎన్నికల్లో ఓటమి తర్వాత వెళ్లిపోయారు. అయితే, చేరినప్పటి నుంచి కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నారు నాదెండ్ల మనోహర్. పవన్ కళ్యాణ్ కూడా నాదెండ్లకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు. అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు కూడా నాదెండ్లను తోడు తీసుకుని వెళ్లారు. పార్టీ పరంగా కీలక కమిటీల్లో నాదెండ్లకు స్థానం కల్పించారు.

నాదెండ్ల కూడా బయట పెద్దగా మాట్లాడే వ్యక్తి కాదు. తన పని తాను చేసుకుని పోయే రకం లీడర్. అయితే, అలాంటి వ్యక్తిని జనసేన నుంచి బయటకు పంపేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. పవన్ కళ్యాణ్ ఆఫీసులో లేని సమయంలో నాదెండ్ల చెప్పినట్టు చేయాల్సి వస్తుందన్న కారణంతో ఆయనకు పొగబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఇద్దరు ముగ్గురు జనసేన నేతలు నాదెండ్ల మీద అసంతృప్తి గళం వినిపించారు. అయితే, పవన్ కళ్యాణ్ అవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో ఈసారి నేరుగా నాదెండ్లను టార్గెట్ చేసేందుకు ఆ నేతలు సిద్ధమైనట్టు సమాచారం.
First published: October 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading