SOFTWARE ENGINEER FROM GUNTRUR DISTRICT IS CONTESTING FOR SARPANCH POST IN ANDHRA PRADESH GRAMA PANCHAYAT EELECTIONS PRN GNT
AP Panchayat elections: రూ.30 లక్షలు జీతం.. సర్పంచ్ పదవికి పోటీ.. ఎక్కడో తెలుసా..
గుంటూరు జిల్లాలో సర్పంచ్ పదవికి పోటీపడుతున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్
AP Panchayat Elections: లాక్ డౌన్ (Lock Down) పుణ్యమా అని సాఫ్ట్ వేర్ ఇంజనీర్లందరికీ (Software Engineers) వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from Home) అవకాశముండటం సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు సొంతూళ్లలో పోటీకి సై అంటున్నారు.
నాలుగు గోడల మధ్య మిగతా సమాజంతో పనిలేకుండా బ్రతుకుతూ తన ఎదుగుదలే తప్ప మిగిలిన వారికి వీసమెత్తైనా ఉపయోగపడని తన ఉద్యోగ జీవితం కంటే.. పదిమందికి ఉపయోగపడేలా జీవించాలనే ఓ యువకుడి ఆలోచన అతనిని సర్పంచ్ అభ్యర్ధి రేసులో నిలిచేలా చేసింది. మా వాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్..నెలకి రెండున్నర లక్షల రూపాయల జీతం, సంవత్సరానికి ముఫ్ఫై లక్షలు సంపాదన అని గర్వంగా చెప్పుకుంటారు తల్లిదండ్రులు. ఐతే ప్రతి గ్రామంలో అలాంటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు పదుల సంఖ్యలో ఉంటారు. కానీ గ్రామానికి సర్పంచ్ ఒక్కడే ఉంటాడు. పది మందిలో ఒక్కడిలా కాకుండా పది మంది కోసం ఒక్కడులా బ్రతకాలి అనే ఆశయంతో ఓ యువకుడు సర్పంచ్ అభ్యర్ధి రేసులో నిలిచిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామానికి చెందిన గాలి. సతీష్ బాబు అనే యువకుడు బెంగుళూరు లోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి ఏడాదికి 30లక్షల రూపాయల జీతం, కార్పొరేట్ జీవితం, లగ్జరీ లైఫ్ ఇవేవీ ఆ యువకునికి సంతృప్తిని ఇవ్వలేక పోయాయి. పైగా కోవిడ్ -19 పుణ్యమా అని లాక్ డౌన్ మొదలైన దగ్గరి నుండి ఇంటి వద్ద నుండి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో తన స్వగ్రామంలో సమస్యలపై అవగాహనతో పాటు తన సొంత ఊరికి ఎంతో కొంత మేలు చేయాలనే తలంపుతో సతీష్ బాబు కండ్లగుంట గ్రామ సర్పంచ్ అభ్యర్ధిగా రంగంలోకి దిగారు.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కదా మరి రాజకీయం వంట పడుతుందా అని ఎవరైనా సతీశ్ బాబు ని ప్రశ్నిస్తే.. ఉద్యోగ జీవితంలో ఐనా రాజకీయాలలో ఐనా తాను చేయవలసింది సమస్యలు పరిష్కరించడమే కదా.. కాకపోతే అక్కడ కంపెని క్లైంట్ల సమస్యలు పరిష్కరించాలి. ఇక్కడ తన సొంత గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరించడం రెండూ ఒకటే అంటూ నవ్వుతూ సమాధానం చెబుతాడు సతీశ్ బాబు.
లాక్ డౌన్ పుణ్యమా అని సాఫ్ట్ వేర్ ఇంజనీర్లందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశముండటం సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు సొంతూళ్లలో పోటీకి సై అంటున్నారు. ఏపీలో చాలా చోట్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, ప్రైవేట్ ఉద్యోగులు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా సర్పంచ్ పదవులకు పోటీ పడుతున్నారు. కాలేజీల నుంచి నేరుగా పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి నామినేషన్లు వేసిన వారు కూడా ఉన్నారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి యువత గ్రామాభివృద్ధి కోసం పోటీపడుతుండటంతో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.