SOCIAL MEDIA WAR BETWEEN YS JAGAN MOHAN REDDY VS NANDAMURI BALAKRISHNA TA
వైయస్ జగన్ Vs బాలకృష్ణ.. సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాల వార్..
దీనిపై గతంలో సోషల్ మీడియాలోనూ అనేక ఊహాగానాలు వచ్చాయి. వాటికి వైసీపీ క్లారిటీ కూడా ఇచ్చింది.
ఏపీలో రాజకీయంగా తెలుగు దేశం పార్టీ వర్సెస్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో బద్ద శతృత్వం ఉందన్న సంగతి తెలిసిందే కదా. ఇక తెలుగు దేశం విపక్షంలోకి వైసీపీ అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇక వై.యస్.జగన్మోహన్ రెడ్డి..బాలయ్యకు అభిమాని ఒక ఫోటో వైరల్ అవుతోంది. దానికి కౌంటర్‌గా వైసీపీ శ్రేణులు మరో ఫోటోను సర్కులేట్ చేస్తున్నారు. మరి సోషల్ మీడియా వేదిక జరుగుతున్న ఈ వార్‌లో ఎవరిది నిజం అనే విషయం తేలాల్సి ఉంది.
ఏపీలో రాజకీయంగా తెలుగు దేశం పార్టీ వర్సెస్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో బద్ద శతృత్వం ఉందన్న సంగతి తెలిసిందే కదా. ఇక తెలుగు దేశం విపక్షంలోకి వైసీపీ అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా టీడీపీకి చెందిన సోషల్ మీడియా విభాగం వారు.. బాలకృష్ణ ‘సమర సింహా రెడ్డి’ సినిమా విడుదలై ఏడాది కావొస్తున్న తరుణంలో ఇప్పటి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి.. బాలయ్య కడప జిల్లా అధ్యక్షులుగా ఉన్నటు వంటి ఫోటోను సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. అందులో 2000 నూతన సంవత్సర శుభాకాంక్షలతో కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పేపర్ ప్రకటన ఉంది.
బాలకృష్ణ కడప జిల్లా అధ్యక్షుడుగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి
అది ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. ఆ ప్రకటన పై వైసీపీ శ్రేణులు కౌంటర్ ఎటాక్ చేసారు. వై.యస్.జగన్మోహన్ రెడ్డి 2003లో తన భార్యతో ఒక గార్డెన్లో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అంతేకాదు అసలు వై.యస్.జగన్మోహన్ రెడ్డి అసలు ఏ హీరోకు కూడా అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉండలేదు. ఆయన ఏ కథానాయకుడిని నెత్తిన పెట్టుకొని ఊరేగలేదు అంటూ సదరు టీడీపీ శ్రేణులు సర్కులేట్ చేస్తున్న ఫోటోకు కౌంటర్‌గా మరో ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. అందంత ఫేక్ ఎడిటింగ్ అని చెబుతున్నారు. అంతేకాదు వై.యస్.జగన్మోమన్ రెడ్డి ఇచ్చినట్టు ఉన్న ప్రకటన వెనక ఎవరో ఎడిట్ చేసినట్టుగానే ఉంది. మరోవైపు బాలయ్యకు జగన్ అనే అభిమాన సంఘం నాయకుడు ఉన్నాడు. ఆయన పేరుతో ఉన్న యాడ్‌కు వై.యస్.జగన్మోహన్ రెడ్డి పేరుతో పాటు ఫోటోను యాడ్ చేసినట్టు చెబుతున్నారు.
తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్‌ను విమర్శించినా.. ఎక్కడ నందమూరి బాలకృష్ణను విమర్శించిన దాఖలాలు లేవు. ఎక్కడ కూడా బాలయ్యకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట మాట్లాడ లేదు.దీన్ని బట్టి ఇది నిజమే కావచ్చు మరి కొందరు వాదిస్తున్నారు. మరి రెండు వర్గాలు వారు చేస్తున్న ఈ ప్రచారంలో ఎవరు నిజం చెబుతున్నారు. ఎవరు ఫాల్స్ ప్రచారం చేస్తున్నారనే విషయంలో క్లారిటీ రావాలంటే జగన్, బాలయ్య ఇద్దరిట్లో ఎవరో ఒకరు స్పందిచాల్సిందే అంటున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.