Home /News /politics /

SOCIAL MEDIA CAMPAIGNING PLAYING CRUCIAL ROLE IN ANDHRA PRADESH PANCHAYAT ELECTION HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో మారిన ట్రెండ్... ఇప్పుడిదే ప్రచారాస్త్రం

పంచాయతీ ఎన్నికల్లో జోరుగా సోషల్ మీడియా ప్రచారం

పంచాయతీ ఎన్నికల్లో జోరుగా సోషల్ మీడియా ప్రచారం

AP Panchayat Elections: ఎన్నికలు వచ్చాయంటే చాలు పోటీలో ఉన్న అభ్యర్థులు తమ అనుచరులు, బంధువులతో ఇంటింటి ప్రచారంలోకి దిగుతారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.

    ఎన్నికలు వచ్చాయంటే చాలు పోటీలో ఉన్న అభ్యర్థులు తమ అనుచరులు, బంధువులతో ఇంటింటి ప్రచారంలోకి దిగుతారు. చేతిలో ఎన్నికల గుర్తులకు సంబంధించిన కరపత్రాలు, భుజాన జెండాలు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పల్లెపోరులో టెక్నాలచీ వచ్చి చేరుతోంది. సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. వాట్సాప్ గ్రూపులు, ఫేస్ బుక్ పేజీల్లో ప్రచారపర్వం జోరుగా సాగుతోంది. జెండాల స్థానంలో వాట్సాప్ డీపీలు, ఫామ్ ప్లేట్స్ ప్లేస్ లో వాట్సాప్ గ్రూపులు వచ్చి చేరాయి. అసెంబ్లీ ఎన్నికలకు ధీటుగా సాగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మూస పద్దతులకు స్వస్తి పలుకుతున్న అభ్యర్థులు.. స్మార్ట్ ఫోన్లతో స్మార్ట్ గా దూసుకెళ్తున్నారు. పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటి ప్రచారం చేస్తూనే.. యువత ఓట్లను దక్కించుకునేందుకు స్మార్ట్ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది.

    ఊరికో వాట్సాప్ గ్రూప్

    పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వాట్సాప్ ద్వారానే ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. స్థానిక సమస్యలతో మేనిఫెస్టోలు తయారు చేసి గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు దాదాపు 80 శాతం మంది అభ్యర్థులు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో అయితే వందలాది వాట్సాప్ గ్రూపులు క్రియేట్ అయినట్లు సమాచారం. కోనసీమలోని సఖిలేటిపల్లి, రాజోలు, మలికీపురం మండలాలతో పాటు ఏజెన్సీ గ్రామాల్లో కూడా వాట్సాప్ పబ్లిసిటీ నడుస్తోంది. అంబాజీపేట మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి తాను 20 ఏళ్లుగా గ్రామానికి చేసిన సేవను వీడియో రూపంలో రిలీజ్ చేసి షేర్ చేస్తున్నారు. మరో గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఎమ్మెల్యే స్థాయిలో ప్రచారం చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

    ఇది చదవండి: ఒక్కో ఇంటికి మూడు కిలోల చికెన్... కాదంటే కోడి... ఓటర్లకు బంపర్ ఆఫర్



    సోషల్ మీడియానే కీలకం
    సోషల్ మీడియా ప్రచారం మొదటి రెండు విడతల ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. దీంతో మూడు, నాలుగో విడత ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ములాను అభ్యర్థులు ఫాలో అయిపోతున్నారు. ఇక స్మార్ట్ ఫోన్ ఉన్నవారికి వాట్సాప్ ఓకే.. మరి లేని వారి పరిస్థితేంటని కూడా కొందరు ఆలోచిస్తున్నారు. అందుకే బల్క్ మేసేజ్ లు పంపేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఓటర్ల ఫోన్ నంబర్లు సేకరించి.. గ్రూప్ SMSలు పంపుతున్నారు. తామేం చేశామో.., ఏం చేస్తామో.. చెప్తూ మెసేజ్ లు పంపుతున్నారు. అలాగే కామన్ డీపీలు, ప్రచారాలతో కూడిన గ్రాఫిక్ కార్డులు తయారు చేయిస్తున్నారు కూడా. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి సీన్లు కనిపిస్తాయి. పంచాయతీ లెవల్లో కూడా ఇదే రిపీట్ అవుతోంది. ఆడియో, వీడియో సందేశాలు కూడా పంచాయతీల్లో సర్క్యులేట్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వ్యాపారం కూడా జోరుగానే సాగుతోంది.

    ఇది చదవండి: ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల... పోలింగ్ ఎప్పుడంటే..



    అదే కారణం..

    ప్రచారానికి సరైన సమయం లేకపోవడంతో అభ్యర్థులు ఈ స్మార్ట్ ఫార్ములాను అనుసరిస్తున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తుండటం.., ఓటర్లకు గుర్తులపై సరైన అవగాహన లేకపోవడంతో వాట్సాప్, ఫేస్ బుక్ పేజీల్లోనే నమూనా బ్యాలెట్ ను షేర్ చేస్తున్నారు. అంతేకాదు వాటికి వచ్చిన లైకులు, షేర్లను కూడా విశ్లేషిస్తూ విజయవకాశాలను బేరీజు వేసుకుంటున్నారు.

    ఇది చదవండి: స్టూడెంట్ ని లవ్ మ్యారేజ్ చేసుకున్న టీచర్.. ప్రేమికుల రోజే ఊహించని ట్విస్ట్



    సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల రాకతోనే..
    ఈ ఎన్నికల్లో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే. కరోనా లాక్ డౌన్ కారణంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించడంతో వారిలో దాదాపు 80 శాతం మంది సొంతగ్రామాల్లోనే ఉన్నారు. కొందరు నేరుగా ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో వారే ఈ స్మార్ట్ ఐడియాలతో ఎన్నికల ప్రచారంలో మార్పులు తీసుకొచ్చారు. గ్రామాల్లోని ఆయా పార్టీల మద్దతుదారులకు సోషల్ మీడియా ప్రచారంపై అవగాహన కల్పించడం, వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా వీలైనంత త్వరగా సమాచారాన్ని షేర్ చేయడం వంటి అంశాల్లో వారే కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మరి స్మార్ట్ ప్రచారం ఎంతమందిని గట్టెక్కిస్తుందో వేచి చూడాలి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra pradesh news, Ap election, Ap local body elections, Facebook, Gram Panchayat Elections, Local body elections, Social Media, Telugu news, Whatsapp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు