ఉపాసన బాటలోనే మరో నటి... మోదీని ప్రశ్నిస్తూ ట్వీట్

మరి అలాంటప్పుడు సౌతిండియన్స్ స్టార్స్‌ను ఎందుకు ఆహ్వానించలేదు. ఎందకింత అసమానత్వం? అంటూ సీనియర్ నటి మండిపడ్డారు.

news18-telugu
Updated: October 23, 2019, 1:52 PM IST
ఉపాసన బాటలోనే మరో నటి... మోదీని ప్రశ్నిస్తూ ట్వీట్
ఉపాసన బాటలోనే మరో నటి... మెదీని ప్రశ్నిస్తూ ట్వీట్స్
  • Share this:
బాలీవుడ్ ప్రముఖులతో ప్రధాని మోదీ సమావేశంపట్ల చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మండిపడ్డారు. బాలీవుడ్ ప్రముఖుల్ని ఆహ్వానించిన మోదీ..... దక్షిణాది తారలను ఎందుకు పిలవలేదన్నారు. దక్షిణాది అంటే మీకు ఎందుకంత వివక్ష అంటూ ప్రశ్నించారు. దక్షిణ చలనచిత్ర పరిశ్రమను కూడా మోదీ గౌరవించాలన్నారు. సౌత్‌పై చిన్నచూపు ఎందుకు అంటూ ట్వీట్ ద్వారా ఉపాసన ప్రశ్నించారు. దక్షిణ భారతం కూడా మోదీని చాలా గౌరవిస్తుంది. ఇప్పుడు ఇదే బాటలో మరో సీనియర్ నటి కూడా చేరారు. తెలుగు తమిళ్ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఖుష్బూ కూడా మోదీని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

దేశవ్యాప్తంగాకూడా సౌతిండియన్ సినిమా ప్రాతినిధ్యం వహిస్తుంది. సౌతిండియన్ నుంచే చాలా పెద్ద సూపర్ స్టార్ వచ్చారన్నారు. ఇండియాలోనే బెస్ట్ యాక్టర్స్ కూడా సౌత్ నుంచి ఉన్నారన్నారు. అంతేకాదు బెస్ట్ టెక్నిషియన్స్ కూడా దక్షిణ భారతదేశంలో ఉన్నారు. మరి అలాంటప్పుడు సౌతిండియన్స్ స్టార్స్‌ను ఎందుకు ఆహ్వానించలేదు. ఎందకింత అసమానత్వం? అంటూ ఖుష్బూ మండిపడ్డారు. అంతేకాకుండా బాలీవుడ్ నుంచి మోదీతో సమావేశానికి వెళ్లిన వారంతా ఈ విషయమై ఆలోచించాలన్నారు.First published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు