సీబీఎస్ఈ ఫలితాలు: మరో సారి ఖుషీ అవుతున్న స్మృతి ఇరానీ

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురు సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో 82 శాతం మార్కులు సాధించింది. ఇందుకు తనకు గర్వంగా ఉందని స్మృతి పేర్కొన్నారు.

news18-telugu
Updated: May 6, 2019, 3:43 PM IST
సీబీఎస్ఈ ఫలితాలు: మరో సారి ఖుషీ అవుతున్న స్మృతి ఇరానీ
స్మృతి ఇరానీ (ఫైల్)
  • Share this:
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో తమ కూతురు మంచి ఫలితాలు సాధించిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేశారు. ‘పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. నా కూతురు 82 శాతం మార్కులు సాధించింది. గర్వంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. కాగా, ఈ నెల 2న 12వ తరగతి ఫలితాల విడుదల సందర్భంగా కూడా ఆమె ఆనందం వ్యక్తం చేశారు. స్మృతి కుమారుడు జోర్.. 12వ తరగతి ఫలితాల్లో 91 శాతంతో ఉత్తీర్ణుడయ్యాడు. ‘నా కొడుకు జోర్‌ను చూసి గర్వపడుతున్నా. వరల్డ్ కెంపో ఛాంపియన్ షిప్‌లో రజతపతకం సాధించడమే కాదు. 12వ తరగతి పరీక్షల్లో 91 శాతంతో ఉత్తీర్ణుడయ్యాడు. తల్లిగా చాలా గర్వపడుతున్నా.’ అని అప్పుడు పేర్కొన్నారు.

ఆ సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ కుమారుడు పులకిత్ కేజ్రీవాల్ కూడా 96.4 శాతం మార్కులు సాధించాడు. పులకిత్ కేజ్రీవాల్ నోయిడా సెక్టార్ 30లోని డీపీఎస్‌లో చదువుతున్నాడు. 2017లో ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో కూడా 10జీపీఏ సాధించాడు. ‘దేవుడి దయ, శ్రేయోభిలాషుల ఆశీస్సులతో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో పులకిత్ 96.4శాతం మార్కులు సాధించాడు.’ అని పులకిత్ తల్లి ట్వీట్ చేశారు. కాగా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గతంలో విద్యాశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేస్తున్నారు.

ఫలితాలు చెక్ చేసుకోండిలా..

  • www.cbseresults.nic.in లేదా www.cbse.nic.in సైట్‌ను ఓపెన్ చేయండి

  • హోం పేజీలోకి వెళ్లి  ‘క్లాస్ 10 రిజల్ట్స్ 2019’ పై క్లిక్ చేయండి

  • మీ రిజిస్ట్రేషన్ నంబరు లేదా రూల్ నంబరును, ఇతర వివరాలను ఎంటర్ చేయండి

  • ఫలితాలు స్క్రీన్‌పై చూపించాక, డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి
First published: May 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>