Kumbh Mela 2019: కుంభమేళాకు కేంద్రమంత్రి... పవిత్రస్నానం చేసిన స్మృతి ఇరాని

అర్ధకుంభమేళా క్రతువు తొలిరోజు పుణ్య స్నాననమాచరించడానికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెల్లవారుజామున ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్నారు. గంగా నదిలో ఆమె పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

news18-telugu
Updated: January 15, 2019, 2:55 PM IST
Kumbh Mela 2019: కుంభమేళాకు కేంద్రమంత్రి... పవిత్రస్నానం చేసిన స్మృతి ఇరాని
గంగానదిలో స్మృతి ఇరాని పుణ్య స్నానం
  • Share this:
ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న అర్థ కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం ఉదయం 5.15 గంటలకు మహాక్రతువు ప్రారంభం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన పుణ్యస్నానాలు ఆచరించారు. మొదటి రాజయోగ స్నానాలతో ప్రారంభమైన కుంభమేళా మార్చి 4 వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా గంగానదిలో పుణ్యస్నానాలు చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు, రాజకీయ ప్రముఖులు, సాధువులు సన్యాసులు తరలివచ్చారు. కుంభమేళా సందర్భంగా కేంద్రమంత్రి స్మృతి ఇరాని గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించారు. అర్ధకుంభమేళా క్రతువు తొలిరోజు పుణ్య  స్నాననమాచరించడానికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెల్లవారుజామున ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్నారు. గంగా నదిలో ఆమె పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె తన ట్విటర్‌ ద్వారా పోస్టు చేశారు.

మరోవైపు యూపీ పోలీసులు కుంభమేళా సందర్భంగా స్నానఘట్టాల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, పారామిలటరీ బలగాలు భారీగా మోహరించాయి. దాదాపు 20వేల మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. సోమవారం దాదాపు 35లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. భక్తుల కోసం 5.5 కిలో మీటర్ల మేర 35 స్నాన ఘట్టాలను ఏర్పాటు చేశారు. కుంభమేళాలో ఈసారి అక్షయ్‌ వాత్‌, సరస్వతి కూప్‌ల వద్ద భక్తులకు పూజలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.450ఏళ్ల కుంభమేళా చరిత్రలో ఈ అవకాశం కల్పించడం ఇదే తొలిసారి.

దాదాపు 150 మిలియన్ల మంది భక్తులు కుంభమేళాకు హాజరయ్యే అవకాశం ఉందని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు లక్ష బయో పోర్టబుల్‌ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు 25వేల మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించారు.

Published by: Sulthana Begum Shaik
First published: January 15, 2019, 2:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading