అస్వస్థతకు గురైన మహిళకు... కాన్వాయ్ ఆపి సాయంచేసిన కేంద్రమంత్రి

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు తర్వాత తొలిసారిగా అమేథి నియోజవకర్గ పర్యటనకు ఆమె బయల్దేరారు. అయితే మార్గం మధ్యలో రోడ్డుపై ఒకచోట అస్వస్థతకు గురైన మహిళను స్మృతి గుర్తించారు.

news18-telugu
Updated: June 23, 2019, 9:56 AM IST
అస్వస్థతకు గురైన మహిళకు... కాన్వాయ్ ఆపి సాయంచేసిన కేంద్రమంత్రి
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు తర్వాత తొలిసారిగా అమేథి నియోజవకర్గ పర్యటనకు ఆమె బయల్దేరారు. అయితే మార్గం మధ్యలో రోడ్డుపై ఒకచోట అస్వస్థతకు గురైన మహిళను స్మృతి గుర్తించారు.
  • Share this:
స్మృతి ఇరాని... గత ఐదేళ్లుగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అమేథిలో రాహుల్ గాంధీని ఓడించి తన సత్తా చాటారు. తాజాగా ఆమె తన మానవత్వం కూడా చాటుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు తర్వాత తొలిసారి అమేథి నియోజవకర్గ పర్యటనకు ఆమె బయల్దేరారు. అయితే మార్గం మధ్యలో రోడ్డుపై ఒకచోట అస్వస్థతకు గురైన మహిళను స్మృతి గుర్తించారు. బాధిత మహిళ నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు పడటంతో ఆమెకు ఏమైందని ఆరాతీశారు కేంద్రమంత్రి. రోడ్డుప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో బాధితురాలు.. నడవలేకపోవడాన్ని గమనించారు. వెంటనే తన కాన్వాయ్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో బాధిత మహిళను చేర్చించి.. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని అక్కడున్న డాక్టర్లను ఆదేశించారు స్మృతి ఇరాని.

ఆతర్వాత ఆమె తనపర్యటనకు బయల్దేరారు. ముందుగా ఎన్నికల అనంతరం మృతిచెందిన బీజీపీ కార్యకర్త సురేంద్ర సింగ్ కుటుంబాన్ని పరామర్శించారు. బరావులియా గ్రామంలో అతడి కుటుంబసభ్యుల్ని ఆమె కలిశారు. అనంతరం దివంగత మాజీ గోవా సీఎం మనోహర్ పారికర్ దత్తత గ్రామాల్లో స్మృతి పర్యటించారు. పారికర్ బరావులియా,హరిహరపూర్ గ్రామాల్ని దత్తత తీసుకున్నారు. ఈ రెండు గ్రామాల్లో పర్యటించి ...పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం పలుప్రాంతల్లోని పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు.


Published by: Sulthana Begum Shaik
First published: June 23, 2019, 9:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading