Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: June 17, 2019, 4:43 PM IST
స్మృతి ఇరానీ
17వ లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రత్యేకంగా నిలిచారు. అమేథీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె... ప్రమాణం చేసేందుకు తన సీటు నుంచీ బయలుదేరగానే బీజేపీ సభ్యులు... ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, ఎంపీలు అందరూ అత్యంత ఎక్కువ సేపు డెస్కులపై క్లాప్స్ కొట్టారు. అంతసేపు బల్లలను చరుచుతుంటే... ఆమె ఎంతో సంతోషించారు. హిందీలో ప్రమాణ స్వీకారం చేసిన స్మృతి ఇరానీ... ఆ తర్వాత విపక్ష నేతల్ని ముఖ్యంగా యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీని పలకరించారు. అదే సమయంలో సోనియాగాంధీ నమస్కారం పెట్టి ఆమెను పలకరించారు.
స్మృతి ఇరానీ ప్రమాణస్వీకారం వేళ.. కాంగ్రెస్ చీఫ్, అమేథీలో స్మృతీ ఇరానీ చేతిలో ఓడిపోయిన రాహుల్ గాంధీ సభలో లేరు. 2014 ఎన్నికల్లో రాహుల్ చేతిలో స్మృతి ఇరానీ 2 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచీ అదే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని, అక్కడే ఎక్కువగా తిరుగుతూ, స్థానికుల్ని కలుస్తూ... వారి మనసులు గెలుచుకున్న స్మృతి ఇరానీ ఇప్పుడు... అక్కడే రాహుల్‌ని 55 వేల ఓట్ల మెజార్టీతో ఓడించారు. కాంగ్రెస్ సీనియర్ల సలహాతో... రాహుల్ గనక కేరళలోని వాయనాడ్ స్థానం నుంచీ పోటీ చేయకపోయి ఉంటే... రాహుల్ అసలు లోక్ సభలో అడుగు పెట్టే పరిస్థితే ఉండేది కాదు. వాయనాడ్‌లో గెలిచిన ఆయన... అయినప్పటికీ లోక్ సభకు రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
మధ్యాహ్నం తర్వాత రాహుల్ గాంధీ లోక్‌సభకు హాజరయ్యారు. ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తన తల్లి సోనియాగాంధీ పక్కనే ఆశీనులయ్యారు.
ఇవి కూడా చదవండి :
కక్షసాధింపులకు దిగుతున్నారు... రాజకీయాల్లో ఇది మంచిది కాదన్న కోడెల...
భోజనానికి గ్లాస్ నీళ్లే... చెన్నైలో అత్యంత తీవ్రంగా నీటి కొరత...
మియామీ బీచ్‌లో మహిళ అరెస్ట్... తాబేలు గూడు పాడు చేసిందని...
వాళ్లిద్దరూ లవర్స్... ఆతనిపై యాసిడ్ పోసి... తనపైనా పోసుకుంది... ఎందుకంటే...
Published by:
Krishna Kumar N
First published:
June 17, 2019, 2:35 PM IST