అమేథీలో సొంతిల్లు కట్టుకుంటున్న స్మృతి ఇరానీ

తాను ప్రాతినిథ్యంవహిస్తున్న యూపీలోని అమేథీ నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

news18-telugu
Updated: February 22, 2020, 12:45 PM IST
అమేథీలో సొంతిల్లు కట్టుకుంటున్న స్మృతి ఇరానీ
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
  • Share this:
తాను ప్రాతినిధ్యంవహిస్తున్న యూపీలోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలతో మరింత మమేకమయ్యేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె అమేథీలో సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు. అమేథీ ప్రజలకు అవసరకాలంలో అందుబాటులో ఉండేందుకు అక్కడ సొంత ఇంటిని నిర్మించుకుంటున్నట్లు స్వయంగా స్మృతి ఇరానీ వెల్లడించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోట అమేథీలో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఘన విజయం సాధించడం తెలిసిందే. 2014 ఎన్నికల్లో ఇక్కడ స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ లక్ష పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా తరచూ అమేథీలో పర్యటిస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు స్మృతి.

అమేథీలో తన సొంతింటి నిర్మాణపనులు మొదలయ్యాయని స్మృతి ఇరానీ తెలిపారు. చాలా రోజుల క్రితమే తాను ముంబైని వదిలేశానని...ఇప్పుడు అమేథీ, ఢిల్లీ మధ్య తిరుగుతున్నట్లు చెప్పారు. లక్నోలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీలో విజయం తనదికాదని...అది ప్రజల విజయమని పేర్కొన్నారు. అలా తాను అమేథీ ప్రజల తోబుట్టువు అయ్యానన్నారు. అమేథీలో మునుపటి వీఐపీ సంస్కృతి ఇప్పుడు లేదని, సామాన్యల ఆకాంక్షలకు తగినట్లుగా అధికార యంత్రాంగం పనిచేస్తోందన్నారు. అమేథీ ఎంపీగా తాను గెలిచాక రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ అభివృద్ధి పనులు ముగింపునకు చేరుకున్నాయని స్మృతి ఇరానీ వెల్లడించారు.
Published by: Janardhan V
First published: February 22, 2020, 12:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading