అమేథీలో స్మృతి ఇరానీ నామినేషన్.. అఫిడవిట్‌లో ఆసక్తికరమైన అంశం..

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై స్మతి ఇరానీ పోటీ చేస్తున్నారు.

news18-telugu
Updated: April 11, 2019, 4:42 PM IST
అమేథీలో స్మృతి ఇరానీ నామినేషన్.. అఫిడవిట్‌లో ఆసక్తికరమైన అంశం..
నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న స్మృతి ఇరానీ
  • Share this:
కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆమె పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో కూడా ఆమె రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి ఆమె రాహుల్ గాంధీ మీద పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ముందు ఆమె తన కుటుంబంతో కలసి హోమం నిర్వహించారు. అనంతరం బీజేపీ కార్యకర్తల ర్యాలీ మధ్య అమేథీలో రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను కేంద్ర మంత్రి పొందుపరిచారు.

చరాస్తులు

స్మృతి ఇరానీ పేరు మీద రూ.1,75,02,848
భర్త జుబేన్ ఇరానీ పేరు మీద రూ.1,69,86,814
పిల్లల పేరు మీద రూ.3,75,134

స్థిరాస్తులు
స్మృతి ఇరానీ రూ.2,95,99,280జుబేన్ ఇరానీ రూ.2,97,31,000

స్మృతి ఇరానీకి ఎలాంటి అప్పులు లేవు. ప్రభుత్వ సంస్థలకు కూడా ఎలాంటి బకాయిలు లేవు.
Published by: Ashok Kumar Bonepalli
First published: April 11, 2019, 4:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading