స్మృతి ఇరానీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి...డిగ్రీ డిస్‌కంటిన్యూ వివాదంపై ముదరుతున్న రగడ...

స్మృతి ఇరానీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం, చేయకపోవడం వివాదం కాదని, అయితే ఎన్నికల సంఘాన్ని తప్పుదోవపట్టించడం దారుణమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది విమర్శించారు.

news18-telugu
Updated: April 12, 2019, 7:39 PM IST
స్మృతి ఇరానీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి...డిగ్రీ డిస్‌కంటిన్యూ వివాదంపై ముదరుతున్న రగడ...
స్మృతి ఇరానీ (ఫైల్)
  • Share this:
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమేథి నుంచి బరిలోకి దిగిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలపై ప్రస్తుతం రగడ నడుస్తోంది. 2014లో సమర్పించిన అఫిడవిట్ లో స్మృతి ఇరానీ తాను 1994లో డిగ్రీ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అయితే 2019లో దాఖలు చేసిన అఫిడవిట్ లో మాత్రం తాను 1994లో ఢిల్లీ యూనివర్సిటీలో ఓపెన్ స్కూల్ విధానంలో బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ కోర్సులో చేరానని అయితే మొదటి సంవత్సరంతోనే డిస్ కంటిన్యూ చేసినట్లు పేర్కొన్నారు. అయితే స్మృతి ఇరానీ ఎన్నికల కమిషన్ ను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతే కాదు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గానూ ఆమెను ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. స్మృతి ఇరానీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం, చేయకపోవడం వివాదం కాదని, అయితే ఎన్నికల సంఘాన్ని తప్పుదోవపట్టించడం దారుణమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది విమర్శించారు. అంతేకాదు గతంలో కోర్టులకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారని విమర్శించారు. అయితే విద్యార్హతలకు సంబంధించి తప్పుడు రికార్డులు తయారు చేయడంతో పాటు, తప్పుడు అఫిడవిట్ లు సమర్పించిన నేపథ్యంలో స్మృతి ఇరానీ చట్టప్రకారం శిక్షార్హురాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

ఇదిలా ఉంటే స్మృతి ఇరానీ విద్యార్హతల విషయంలో 2019లో సమర్పించిన అఫిడవిట్ లో గ్రాడ్యూయేషన్ పూర్తి కాలేదని ప్రకటించడంతో, నెటిజన్లు స్పందిస్తున్నారు. స్మృతి ఇరానీ గ్రాడ్యూయేషన్ కూడా పూర్తి చేయకుండా ఇంత కాలం బుకాయించడం పట్ల నెటిజన్లు ట్వీట్లతో విమర్శిస్తున్నారు.

Published by: Krishna Adithya
First published: April 12, 2019, 7:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading