SMRITI IRANI ACCUSES PRIYANKA OF INSULTING LAL BAHADUR SHASTRI SB
శాస్త్రీకి ఆ దండ వేస్తారా...ప్రియంక గాంధీపై స్మతి ఇరానీ ఫైర్
ప్రియాంక గాంధీ, స్మృతి ఇరాని
ఆ వీడియోలో అభిమానులు తనపై వేసిన పూలమాలను తీసి శాస్త్రి విగ్రహానికి ప్రియాంక వేసినట్లుగా ఉంది. ఈ వీడియోతో పాటు హిందీలో ఓ వ్యంగ్య కవితను కూడా స్మృతి పోస్ట్ చేశారు.
ప్రియాంక గాంధీపై మండిపడ్డారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. గంగాయాత్ర సందర్భంగా తనకు వేసిన పూలమాలను మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రీ విగ్రహానికి ప్రియాంక నివాళుర్పించారని ఆరోపించారు. శాస్త్రీని ప్రియాంక అవమానించారని ధ్వజమెత్తారు. దీనికి సంబంధించిన వీడియోను స్మృతి ట్విటర్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో అభిమానులు తనపై వేసిన పూలమాలను తీసి శాస్త్రి విగ్రహానికి ప్రియాంక వేసినట్లుగా ఉంది. ఈ వీడియోతో పాటు హిందీలో ఓ వ్యంగ్య కవితను కూడా స్మృతి పోస్ట్ చేశారు. మరోవైపు ప్రియాంక గాంధీ ఘటనపై కొంతమంది బీజేపీ నేతలు కూడా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో శాస్త్రికి ఏనాడూ గౌరవం లభించలేదని ఆరోపించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ గంగా యాత్ర చేపట్టిన సందర్భంగా ఆమె బుధవారం వారణాసిలో పర్యటించారు. అక్కడ రామ్‌నగర్‌లోని శాస్త్రి గృహాన్ని సందర్శించి ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అయితే ఈ ఘటనలో ఆమె కార్యకర్తలు తనపై వేసిన పూలమాలను తీసి శాస్త్రి విగ్రహానికి అలంకరించారు. ఇప్పుడు ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే శాస్త్రీ విగ్రహం వద్దకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. ప్రియాంక అక్కడి నుంచి వెళ్లిపోయిన కొద్ది సేపటికే శాస్త్రి విగ్రహాన్ని గంగా జలంతో శుద్ధి చేశారు. మరోవైపు ఈ ఘటనపై నెటిజన్లు కూడా పలురకాలు కామెంట్లు చేస్తున్నారు.
मुंडी झुकाइएके सर झटकाइएके
गुमान में बिटिया भूल गई मरजाद
आपन गले की उतरन, पहनाए दीहिन
शास्त्री जी के अपमान पर ताली बजाएके, हाथ हिलाइएके
चल दीहलें कांग्रेस बिटिया तोहार pic.twitter.com/ndwT15Y8co
— Chowkidar Smriti Z Irani (@smritiirani) March 20, 2019
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.