రాజ్యసభలో బీజేపీ ఎంపీకి కరెంట్ షాక్

ఈ విషయం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి తెలియడంతో ఆయన సభను పావుగంట పాటు వాయిదా వేశారు.

news18-telugu
Updated: July 29, 2019, 4:00 PM IST
రాజ్యసభలో బీజేపీ ఎంపీకి కరెంట్ షాక్
రాజ్యసభ (ఫైల్ ఫోటో)
  • Share this:
పవర్ కట్‌లు.. కరెంట్ షాక్‌లు సాధారణ ప్రజలకే అని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడా షాక్‌లు మంత్రులకు ఎంపీలను కూడా తగులుతున్నాయి. తాజాగా పెద్దల సభలో ఓ అధికార పార్టీ ఎంపీకి ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. రాజ్యసభలో ఇవాళ బీజేపీ ఎంపీ విద్యుదాఘాతానికి గురికావడంతో ఇతర సభ్యులు సైతం  షాక్‌కు గురయ్యారు. బీజేపీ ఎంపీ కేజే ఆల్ఫోన్స్  సీటు వద్ద ఉండే మైక్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో ఆయన వైర్లు పట్టుకుని సరిచేయబోయిే ప్రయత్నం చేశారు. అంతే ఒక్కసారిగా ఎంపీ  ఆల్ఫోన్స్ కు కరెంట్ షాక్ తగిలింది. దాంతో ఇతర సభ్యులు ఆయన్ను పరామర్శించారు.

దీంతో ఆల్ఫోన్స్ తన సీట్లోంచి వెళ్లి మరో సీట్లో కూర్చున్నారు. ఈ విషయం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి తెలియడంతో ఆయన సభను పావుగంట పాటు వాయిదా వేశారు. పొగలు వస్తున్న మైక్ ను సరిచేయాలంటూ రాజ్యసభ సిబ్బందిని ఆదేశించారు. ఉదయం మాజీ ఎంపీ జైపాల్ రెడ్డి మృతికి సంతాపం తెలిపిన అనంతరం సాధారణ కార్యకలాపాల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం మీద పెద్దల సభలో కూడా... పవర్ షాక్ తగలడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ న్యూస్‌గా మారింది.

First published: July 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>