కమల్ హాసన్‌పై చెప్పు విసిరిన వ్యక్తి..

కమల్ హాసన్ మీద చెప్పు విసిరిన వ్యక్తితో పాటు మరో 11 మందిని పోలీసులు పట్టుకున్నారు.

news18-telugu
Updated: May 15, 2019, 10:33 PM IST
కమల్ హాసన్‌పై చెప్పు విసిరిన వ్యక్తి..
కమల్ హాసన్ (Image : Twitter)
  • Share this:
తమిళ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ మీద ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. విల్లుపురంలోని ఓ రోడ్ షో లో పాల్గొన్న కమల్ హాసన్ మీద ఆ వ్యక్తి చెప్పు విసిరాడు. అయితే, అది కమల్ హాసన్‌కు తగలలేదు. మరికొందరు కూడా కమల్ మీదకు చెప్పులు విసిరే ప్రయత్నం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. చెప్పు విసిరిన వ్యక్తితో పాటు మరో 11 మందిని పోలీసులు పట్టుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజుల క్రితం కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది ఓ హిందూ అని, అతని పేరు నాథూరామ్ గాడ్సే అని అన్నారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. కమల్ హాసన్ మీద చర్యలు తీసుకోవాలంటూ పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. కమల్ హాసన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. పలు హిందూ సంఘాలు కమల్ హాసన్ మీద ఇప్పటికే ఆగ్రహంతో ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. రెండు రోజుల తర్వాత మళ్లీ ప్రజల్లోకి వచ్చిన కమల్ హాసన్ మీద చెప్పు దాడి జరిగింది.

First published: May 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>