జగన్ నిర్ణయంతో.. సింగపూర్ అధికారులు హ్యాపీ: ఐవైఆర్

సీఎం జగన్, అమరావతి (ప్రతీకాత్మక చిత్రం)

ఇప్పటి ప్రభుత్వం నిర్ణయం ఒకరకంగా వారికి ప్రాజెక్టు నుంచి విముక్తి కల్పించింది' అంటూ ఐవైఆర్ ట్వీట్ చేశారు.

  • Share this:
    ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధానిలో స్టార్ట్ అప్ ఏరియా ప్రాజెక్ట్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలో 6.84 చ.కిమీ ల అభివృద్ధి కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, సింగపూర్ కంపెనీల మధ్య అప్పటి ప్రభుత్వ హయాంలో ఒప్పందం ఉంది. ఆ ఒప్పందాన్ని అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సింగపూర్ కంపెనీలు పరస్పర అంగీకారంతో అమరావతి డెవలప్మెంట్ ప్రొజెక్ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 1,691 ఎకరాల్లో మూడు దశల్లో స్టార్ట్ అప్ ఏరియాను అభివృద్ధి చేసేలా చంద్రబాబునాయుడి ప్రభుత్వంలో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది.


    అయితే ఆతర్వాత అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు నుంచి అటు సింగపూర్ అధికారులు కూడా ప్రకటించారు. ప్రస్తుత ప్రభుత్వానికి అమరావతి ఆలోచన లేదనే విషయాన్ని గుర్తించామన్నారు. అందుకే ప్రాజెక్టు నుంచి వైదిలిగామని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తెలిపారు. అయితే తాజాగా ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు.  'సింగపూర్ వారికి ఇది కావలసిన కార్యము గంధర్వులే తీర్చినట్లు అయిందంటూ సెటైర్ వేశారు. పర్యావరణ సమస్యల దృష్ట్యా, వరదల ప్రభావం వల్ల ఈ ప్రాజెక్టు సాధ్యం కాదని సింగపూర్ అధికారులు ఎప్పుడో గ్రహించారన్నారు. అందుకనే ఇన్నాళ్లు జాప్యం చేస్తూ కాలం గడిపారన్నారు ఐవైఆర్ ఇప్పటి ప్రభుత్వం నిర్ణయం ఒకరకంగా వారికి ప్రాజెక్టు నుంచి విముక్తి కల్పించింది' అంటూ ఐవైఆర్ ట్వీట్ చేశారు.    Published by:Sulthana Begum Shaik
    First published: