30 ఏళ్లుగా ఒక్క ముస్లిం కూడా ఎంపీగా గెలవని రాష్ట్రం... ఎక్కడో తెలుసా...?

1984లో చివరి సారిగా కాంగ్రెస్ తరపున అహ్మద్ పటేల్ గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి నేటి వరకూ 30 సంవత్సరాలుగా ఒక్క ముస్లిం కూడా కూడా పార్లమెంటులో అడుగు పెట్టలేదు.

news18-telugu
Updated: April 5, 2019, 3:27 PM IST
30 ఏళ్లుగా ఒక్క ముస్లిం కూడా ఎంపీగా గెలవని రాష్ట్రం... ఎక్కడో తెలుసా...?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలోని పశ్చిమ భాగంలో గుజరాత్ నుంచి చివరిసారిగా పార్లమెంట్‌కు వెళ్లిన ఏకైక ముస్లిం ఎంపీ అహ్మద్ పటేల్, అంతే అప్పటి నుంచి 2014 వరకూ ఒక్క ముస్లిం ఎంపీ కూడా గుజరాత్ నుంచి పార్లమెంట్‌లోకి అడుగు పెట్టలేదు. 1989లో చివరిసారిగా భరూచ్ నుంచి పోటీచేసిన అహ్మద్ పటేల్ 1.15 ఓట్ల తేడాతో చందు దేశ్ ముఖ్ చేతిలో ఓటమి చెందారు. అప్పటి నుంచి నేటి వరకూ ఒక్క ముస్లిం ఎంపీ కూడా గుజరాత్ నుంచి లోక్ సభలో అడుగు పెట్టే పరిస్థితి ఏర్పడలేదు. అడపదడపా ఒకరు, లేదా ఇద్దరు సభ్యులకు కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థులను పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా నిలబెట్టినప్పటికీ వారెవ్వరూ గెలిచే స్థాయిలో పోటీనివ్వలేదు. ఇక అధికార బీజేపీ నుంచి అయితే ముస్లిం అభ్యర్థుల పట్ల ఎలాంటి ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

గుజరాత్ రాష్ట్ర జనాభాలో ముస్లింల జనాభా 9.5 శాతంగా ఉంది. 1962లో ఏర్పడిన గుజరాత్ రాష్ట్రంలో బనస్కాంత ప్రాంతం నుంచి ఒకేఒక్క ముస్లిం అభ్యర్థి జోహరా చావ్డా గెలుపొంది, పార్లమెంటులో ప్రవేశించాడు. అనంతరం 1977లో అహ్మద్ పటేల్, ఎహసాన్ జాఫ్రీ ఇరువురు గెలచారు. రాష్ట్రంలోని భరూచ్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో ముస్లింల జనాభా అధికంగా 22.2 శాతంగా ఉంటుంది. 2014 ఎన్నికల్లో మొత్తం 334 మంది ముస్లిం అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి బరిలోకి దిగగా, వారిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి బరిలో నిలిచాడు. సాధారణంగా ముస్లిం అభ్యర్థులు ఎక్కువగా పంచ్ మహల్, ఖేడా, ఆనంద్, భరూచ్, నవ్సరీ, శబర్‌కాంత, జామ్‌నగర్, జునాగఢ్ ప్రాంతాల నుంచి ఎక్కువగా బరిలో నిలుస్తుంటారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ పార్టీ నుంచి ముగ్గురు ముస్లిం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారని, గతంలో పార్లమెంటు ఎన్నికల్లో ముస్లింలకు టిక్కెట్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ దోషి పేర్కొనడం విశేషం.

First published: April 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు