సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ప్రేమ్‌సింగ్ తమాంగ్..

ప్రేమ్‌సింగ్ తమాంగ్ (ఫైల్)

Sikkim Assembly: ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌తో గవర్నర్‌ గంగా ప్రసాద్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. గ్యాంగ్‌ట‌క్‌లోని ప‌ల్జోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ పార్టీ మద్దతు దారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

  • Share this:
    సిక్కిం క్రాంతికారి మోర్చా అధ్యక్షుడు ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ ఈ రోజు సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌తో గవర్నర్‌ గంగా ప్రసాద్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. గ్యాంగ్‌ట‌క్‌లోని ప‌ల్జోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ పార్టీ మద్దతు దారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రేమ్‌ సింగ్‌ నేపాలి భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకార చేశారు. సిక్కిం అసెంబ్లీలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎస్‌కేఎమ్, ఎస్డీఎఫ్‌ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఎస్‌కేఎమ్ 17 స్థానాల్లో గెలుపొందగా, ఎస్టీఎఫ్ 15 స్థానాలతో తృటిలో అధికారాన్ని కోల్పోయింది. ఫలితంగా 24 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న సిక్కిం క్రాంతికారి మోర్చా అధికారాన్ని దక్కించుకుంది.

    సిక్కింలో వరుసగా ఆరోసారి అధికారం చేపట్టాలన్ని పవన్ కుమార్ చామ్లింగ్ ఆశలకు గండిపడింది. తాజాగా ఎన్నికల్లో సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్ ఓడిపోవడంతో చామ్లింగ్‌ 24 ఏళ్ల సుదీర్ఘ పాలనకు తెరపడింది. 1994, 1999, 2004, 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చామ్లింగ్ నేతృత్వంలోని ఎస్డీఎఫ్ జయకేతనం ఎగురవేసింది. 2014 ఎన్నికల్లో 22 సీట్లతో విజయం సాధించిన చామ్లింగ్, ఈసారి మాత్రం 15తోనే సరిపెట్టుకున్నారు.
    First published: