Home /News /politics /

SIDHU AMARINDER TUSSLE INTENSIFIES AS FORMER CRICKETER REFUSES TO TAKE CHARGE OF NEW MINISTRY

సీఎం అమరీందర్-సిద్ధు సిగపట్లు...ఢిల్లీకి చేరిన పంచాయితీ

పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, మంత్రి సిద్దు (ఫైల్)

పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, మంత్రి సిద్దు (ఫైల్)

పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తీరుపై పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసేందుకు మంత్రి సిద్ధు ఢిల్లీ చేరుకోనున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది.

    పంజాబ్‌ సీఎం అమరీందర్ సింగ్, మంత్రి నవ్ జ్యోత్ సింగ్ సిద్ధు మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇద్దరి మధ్య పంచాయితీ ఢిల్లీకి చేరింది. మంత్రి సిద్ధు ఇది వరకు స్థానిక సంస్థల శాఖ, టూరిజం, సాంస్కృతిక శాఖల బాధ్యతలను నిర్వహిస్తూ రాగా...ఈ బాధ్యతల నుంచి తప్పిస్తూ గురువారం సీఎం అమరీందర్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. వీటి స్థానంలో విద్యుత్ శాఖను ఆయనకు కేటాయించారు. అయితే అమరీందర్ సింగ్ నిర్ణయం పట్ల సిద్ధు గుర్రుగా ఉన్నారు. తనకు కొత్తగా కేటాయించిన విద్యుత్ శాఖ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఈ శాఖ బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్నా..ఆయన సచివాలయానికి వెళ్లలేదు.

    సీఎం అమరీందర్ సింగ్ తీరుపై పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధు శనివారం ఢిల్లీ చేరుకోనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌లో పర్యటిస్తున్నారు. ఆదివారం వరకు రాహుల్ గాంధీ ఇక్కడ పర్యటించనున్నారు. దీంతో ఢిల్లీలో సిద్ధు కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఎవరిని కలుస్తారన్నది తెలియరావడం లేదు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిసి, అమరీందర్ సింగ్ తీరుపై ఆయన ఫిర్యాదు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

    మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ సరైన ఫలితాలు సాధించకపోవడానికి స్థానిక సంస్థల శాఖ మంత్రి సిద్ధూ వైఫల్యమే కారణమని అమరీందర్ సింగ్ ఇటీవల ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను సిద్ధూ తోసిపుచ్చారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో సిద్ధూ పాల్గొననాటి నుంచే ఆయనకు, అమరీందర్ సింగ్‌కు మధ్య వివాదం నడుస్తోంది. అమృత్‌సర్ లోక్‌సభ టిక్కెట్ తనకు దక్కకపోవడం వెనుక సీఎం అమరీందర్ సింగ్ ప్రమేయం ఉందని సిద్ధూ సతీమణి నవ్‌జ్యోత్ కౌర్ ఇటీవల బహిరంగ విమర్శలు చేశారు.
    First published:

    Tags: Amarinder Singh, Navjot Sidhu, Punjab

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు