Home /News /politics /

సిద్ధూ.. ఉంటే ఉండు, లేకపోతే కేబినెట్‌ను వదిలేసి పో..

సిద్ధూ.. ఉంటే ఉండు, లేకపోతే కేబినెట్‌ను వదిలేసి పో..

పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, మంత్రి సిద్దు (ఫైల్)

పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, మంత్రి సిద్దు (ఫైల్)

Punjab: ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో ఏదైనా సమస్య ఉంటే, మంత్రివర్గం నుంచి తప్పుకోవాలని సిద్ధూకు సూచించారు. సిద్ధూ బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చారని, కాంగ్రెస్ నుంచి ఎక్కడికి వెళ్తారో దేవుడికే తెలుసునని అన్నారు.

    పంజాబ్ అధికార పార్టీ కాంగ్రెస్‌లో లుకలుకలు బయటపడుతున్నాయి. ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్, మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాలు మరింతగా ముదురుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తనను తప్పించి నవజ్యోత్‌సింగ్ సిద్ధూ సీఎం కావాలని అనుకుంటున్నాడేమో? అని అమరీందర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన 'మా మాధ్య అలాంటిదేమీ లేదు. ఆశలనేవి అందరికీ ఉంటాయి. ఆయనకు అలాంటి ఆశలే ఉంటే.. మంచిదే. చిన్నప్పటి నుంచి సిద్ధూ నాకు తెలుసు. ఆయనతో నాకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. ఆయన నన్ను తప్పించి సీఎం కావాలని కోరుకుంటున్నారేమో? అది ఆయనకు సంబంధించిన వ్యవహారం' అని అన్నారు. అయితే, సిద్ధూకు మరో మంత్రి సాధు సింగ్ ధరమ్‌సోట్ ఘాటు సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో ఏదైనా సమస్య ఉంటే, మంత్రివర్గం నుంచి తప్పుకోవాలని సిద్ధూకు సూచించారు. సిద్ధూ బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చారని, కాంగ్రెస్ నుంచి ఎక్కడికి వెళ్తారో దేవుడికే తెలుసునని అన్నారు. సిద్ధూపై అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ సమావేశంలో దీన్ని లేవనెత్తుతానని స్పష్టం చేశారు.

    కొద్ది రోజుల క్రితం సిద్ధూ మాట్లాడుతూ తన సతీమణి నవజోత్ కౌర్‌కు చండీగఢ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థినిగా పోటీ చేసే అవకాశం రాకపోవడానికి కారణం సీఎం కెప్టెన్ అమరీందర్ సింగేనని ఆరోపించారు. దీంతో వివాదం రాజుకుంది.
    First published:

    Tags: Amarinder Singh, Congress, Navjot Singh Sidhu, Punjab

    తదుపరి వార్తలు