హరీష్ రావు బీజేపీలోకి వెళ్లరు.. స్పష్టం చేసిన మాజీ ఎంపీ వినోద్

Telangana News: హరీష్ పార్టీ మారతారన్న ఊహాగానాలకు మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెర దించారు. హరీష్ ఎక్కడికీ వెళ్లరని, కాషాయ గూటికి వెళ్తారన్నది పుకారేనని స్పష్టం చేశారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 1, 2019, 6:18 PM IST
హరీష్ రావు బీజేపీలోకి వెళ్లరు.. స్పష్టం చేసిన మాజీ ఎంపీ వినోద్
వినోద్ కుమార్ (ఫైల్)
  • Share this:
టీఆర్‌ఎస్ పార్టీకి ఎంతో సేవ చేసిన హరీష్ రావును ఆ పార్టీ గుర్తించడం లేదని, పార్టీ అధిష్ఠానం చర్యలకు మనస్తాపం చెందిన ఆయన.. కాషాయ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హరీష్‌ను పిలవకుండా కేసీఆర్ అవమానించారని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ముందస్తు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందినా ఆయన్ను పక్కన బెట్టారని, పార్టీలో అవమానాలను భరించడం ఇష్టం లేక ఆయన బీజేపీలోకి జంప్ అవుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హరీష్ పార్టీ మారతారన్న ఊహాగానాలకు మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెర దించారు. హరీష్ ఎక్కడికీ వెళ్లరని, కాషాయ గూటికి వెళ్తారన్నది పుకారేనని స్పష్టం చేశారు.

ఈ రోజు సెక్రటేరియట్ వద్ద మీడియా ఇష్టాగోష్టి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. మరి, హరీష్‌కు మంత్రి పదవి దక్కుతుందా? అని ప్రశ్నించగా.. ‘అది సార్ చూసుకుంటారు’ అని సమాధానం దాటవేశారు. కాగా, మంత్రి వర్గ విస్తరణలో భాగంగా హరీష్, కేటీఆర్‌లకు మంత్రి పదవి దక్కుతుందని జోరుగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు, వినోద్‌కు కూడా మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

First published: July 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు