బావామరుదుల చాలెంజ్...కేటీఆర్‌పై హరీష్ రావు గెలుపు

కేటీఆర్ అసెంబ్లీ నియోజకవర్గం సిరిసిిల్లలో వినోద్‌కు 6వేల ఆధిక్యం వస్తే..హరీశ్‌రావు అసెంబ్లీ స్థానం సిద్దిపేటలో మాత్రం కొత్త ప్రభాకర్‌కు 48 వేల ఓట్ల ఆధిక్యం లభించింది.

news18-telugu
Updated: May 29, 2019, 5:48 PM IST
బావామరుదుల చాలెంజ్...కేటీఆర్‌పై హరీష్ రావు గెలుపు
కేటీఆర్, హరీష్ రావు
  • Share this:
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ 9 సీట్లు గెలించింది. సారు..కారు..పదహారు నినాదంతో ఎన్నిలకు వెళ్లినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. బీజేపీ 4, కాంగ్రెస్‌ 3, ఎంఐఎం ఒక సీట్లో గెలిచింది. ఐతే ఎన్నికల ఫలితాల తర్వాత.. కేటీఆర్, హరీష్ రావు సవాల్‌పై తెలంగాణలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ప్రచార సమయంలో బావహరీష్ రావుకు కేటీఆర్ సవాల్ విసిరారు. హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ కంటే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్‌లో ఎక్కువ మెజార్టీ వస్తుందని ఛాలెంజ్ చేశారు.

బావా మరుదుల సవాల్ సరదాకే అయినప్పటికీ.. రెండు నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు మాత్రం సీరియస్‌గానే తీసుకున్నారు. పోటాపోటీగా పనిచేసి ఎక్కువ మెజార్టీ తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. చివరకు ఫలితాలు వెలువడే నాటికి హరీష్ రావే నెగ్గారు. కేటీఆర్ కరీంనగర్‌లో సిట్టింగ్ ఎంపీ, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులు బోయినపల్లి వినోద్ కుమార్ ఏకంగా ఓటమిపాలయ్యారు.అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ 89,508 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్‌లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. 3,16,427 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు. ఇది తెలంగాణాలోనే రెండో అత్యధిక మెజారిటీ. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే..కేటీఆర్ అసెంబ్లీ నియోజకవర్గం సిరిసిిల్లలో వినోద్‌కు 6వేల ఆధిక్యం వస్తే..హరీశ్‌రావు అసెంబ్లీ స్థానం సిద్దిపేటలో మాత్రం కొత్త ప్రభాకర్‌కు 48 వేల ఓట్ల ఆధిక్యం లభించింది. ఈ లెక్కన కేటీఆర్‌పై బావ హరీష్ రావు పైచేయి సాధించారని టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత హరీష్ రావును పక్కనబెట్టడం వల్లే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదనే ప్రచారం కూడా జరుగుతోంది. ఐతే ఆ ఊహాగానాలను కేటీఆర్ తప్పుబట్టారు. హరీష్ రావును ఎక్కడా పక్కనబెట్టలేదని స్పష్టంచేశారు. నిజామాబాద్‌తో పాటు కరీంనగర్‌, భువనగిరిలో పార్టీ అభ్యర్థుల ఓటమిపై విశ్లేషించుకుంటామని తెలిపారు. దీన్ని టీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బగా భావించకూడదని స్పష్టంచేశారు.


First published: May 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com