HOME »NEWS »POLITICS »siddipet mla harish rao participated in kaleshwaram project inauguration at ranganayaka sagar sk

కేసీఆర్ శ్రమతోనే సాధ్యమైంది..కాళేశ్వరం సంబురాల్లో హరీష్ రావు

కేసీఆర్ శ్రమతోనే సాధ్యమైంది..కాళేశ్వరం సంబురాల్లో హరీష్ రావు
కేక్ కట్ చేస్తున్న హరీష్ రావు

తెలంగాణలో దసరా పండగ ఎంత ముఖ్యమో..కాళేశ్వరం ప్రారంభోత్సవం కూడా అంతే ముఖ్యమన్నారు హరీష్ రావు.

  • Share this:
    హరీష్ రావు ఎక్కడ..? కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ అంతటా దీనిపైనే చర్చ జరుగుతోంది. తన్నీరు లేక కాళేశ్వరం కన్నీరు పెడుతోందని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో భారీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందలాపూర్‌లోని రంగనాయక్ సాగర్ వద్ద ప్రత్యక్షమయ్యారు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్స వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్‌చేశారు.

    కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించడం సంతోషంగా ఉందని.. రానున్న రోజుల్లో రెండు పంటలను చూస్తామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రాజెక్టుల పేర్లు మరిచిపోయామని, ఆ పార్టీ అధికారంలో ఉంటే 30 ఏళ్లు గడిచినా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికాదని విమర్శించారు. ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోయినా...ప్రభుత్వానికి సహకరించిన రైతులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.



    ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణలో ఒక్క భారీ ప్రాజెక్టు కూడా నిర్మించుకోలేకపోయాం. సీఎం కేసీఆర్‌ శ్రమతో మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ 70ఏళ్ల కాలంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చినా ప్రాజెక్టులు కట్టలేదు. కాళేశ్వరం కోసం ఇంజినీర్లు, అధికారులు, కార్మికులు ఎంతో కష్టపడ్డారు.
    హరీష్ రావు, సిద్దిపేట ఎమ్మెల్యే


    తెలంగాణలో దసరా పండగ ఎంత ముఖ్యమో..కాళేశ్వరం ప్రారంభోత్సవం కూడా అంతే ముఖ్యమన్నారు హరీష్ రావు. తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం పనుల్లో తన వంతు సహాయం చేసినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించింది తెలంగాణ సర్కారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ హాజరయ్యారు. ఐతే మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుకు ఆహ్వానం అందలేదు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే మాత్రమే కావడంతోనే ఆహ్వానం అందనట్లు తెలుస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:June 21, 2019, 15:33 IST

    टॉप स्टोरीज