పరీక్షలు బాగా రాయాలన్న హరీశ్‌రావు.. ఆ భరోసాతో విద్యార్థులంతా కలిసి..

జగిత్యాల తర్వాత రెండో స్థానంలో సిద్దిపేట జిల్లా మంచి ఉత్తీర్ణత సాధించింది. 99.33 శాతం ఉత్తీర్ణత సాధించింది. 0.4 శాతం తేడాతో అగ్ర స్థానాన్ని కోల్పోయింది.

news18-telugu
Updated: May 14, 2019, 7:27 AM IST
పరీక్షలు బాగా రాయాలన్న హరీశ్‌రావు.. ఆ భరోసాతో విద్యార్థులంతా కలిసి..
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు (File)
  • Share this:
పదో తరగతి ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు తొలిసారి 90 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోల్చితే 8.65 శాతం ఎక్కువ పాస్ పర్సంటేజీ సాధించారు. అమ్మాయిలు 93.68 శాతం, అబ్బాయిలు 91.18 శాతం ఉత్తీర్ణత సాధించారు. జగిత్యాల జిల్లా తొలి స్థానంలో నిలవగా హైదరాబాద్ అట్టడుగు స్థానాన చేరింది. అయితే, జగిత్యాల తర్వాత రెండో స్థానంలో సిద్దిపేట జిల్లా మంచి ఉత్తీర్ణత సాధించింది. 99.33 శాతం ఉత్తీర్ణత సాధించింది. 0.4 శాతం తేడాతో అగ్ర స్థానాన్ని కోల్పోయింది. 2016-17లో ఆ జిల్లాకు 9వ స్థానం, 2017-18లో 3వ స్థానం దక్కగా.. ప్రస్తుతం జిల్లాకు రెండో స్థానం దక్కిందంటే దానికి కారణం.. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కృషేనని చెప్పాలి. ఎందుకంటే సిద్దిపేట జిల్లా పదో తరగతి ఫలితాల్లోనూ మెరుగైన స్థానంలో నిలవాలన్న లక్ష్యంతో ఆయన గత ఏడాది ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒక్కో విద్యార్థి మార్కుల సగటును పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.

ssc,harish rao,trs,trs mla,trs mla harish rao,ex minister harish rao,harish,telangana ex minister harish rao,TS SSC Results 2019, Telangana ssc results released, Telangana tenth results released, Telangana 10th results released, check Telangana 10th results, check Telangana ssc results, Telangana State Board of Secondary Education, check Telangana tenth results, తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల, తెలంగాణ పదోతరగతి ఫలితాలు, తెలంగాణ టెన్త్ రిజల్ట్స్, టెన్త్ రిజల్ట్స్, తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, పదోతరగతి ఫలితాలు
ఉపాధ్యాయుల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్ రావు (ఫైల్-ట్విట్టర్ ఫోటో)


100శాతం ఉత్తీర్ణత సాధించే పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు బహుమతులు ప్రకటించారు. తానే సొంతంగా తన లెటర్‌ ప్యాడ్‌తో ప్రతి విద్యార్థికి ఉత్తరాలు రాసి ప్రోత్సహించారు. ఆయన అందించిన ప్రోత్సాహం, ఉపాధ్యాయుల భాగస్వామ్యం, విద్యార్థుల పట్టుదలతో సిద్దిపేట జిల్లా రెండో స్థానంలో నిలిచింది. దీంతో హరీశ్ ఖుషీ ఖుషీగా ఉన్నారు.
First published: May 14, 2019, 7:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading