హోమ్ /వార్తలు /National రాజకీయం /

Siddipet Collector: ఉద్యోగానికి రాజీనామా చేసిన సిద్ధిపేట కలెక్టర్.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఛాన్స్ ?

Siddipet Collector: ఉద్యోగానికి రాజీనామా చేసిన సిద్ధిపేట కలెక్టర్.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఛాన్స్ ?

వెంకట్రామిరెడ్డి (ఫైల్ ఫోటో)

వెంకట్రామిరెడ్డి (ఫైల్ ఫోటో)

Siddipet Collector Venkatramireddy: ఈ రోజు సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో వెంకట్రామిరెడ్డికి స్థానం ఇవ్వనున్నట్లు తెలిసింది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్న తరుణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం సిద్దిపేట కలెక్టర్‌గా విధులు వెంకట్రామరెడ్డి.. తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కాసేపట్లో ఆయన టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో వెంకట్రామిరెడ్డికి స్థానం ఇవ్వనున్నట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ రావడంతోనే ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్ అధికారిగా ఉన్న వెంకట్రామిరెడ్డి ఇటీవల వరి పంట విషయంలో చేసిన వ్యాాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలంటూ చెప్పే క్రమంలో సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వ్యవసాయశాఖ అధికారులు, విత్తన దుకాణదారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో యాసంగిలో రైతులకు ఇతర విత్తనాలను విక్రయించాలని, ఎవరైనా వరి విత్తనాలు విక్రయిస్తే.. ఆ దుకాణాన్ని మూసివేస్తామని అన్నారు. తాను కలెక్టర్‌గా ఉన్నంతకాలం ఆ దుకాణం తెరుచుకోదని హెచ్చరించారు. హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చినా తెరుచుకోదన్నారు. కలెక్టర్‌ వ్యాఖ్యల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

సిద్ధిపేట కలెక్టర్‌గా కొన్నేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న వెంకట్రామిరెడ్డికి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన టీఆర్ఎస్‌లో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తారని ఎప్పటికప్పుడు వార్తలు వచ్చాయి. గతంలో మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌ను వెంకట్రామిరెడ్డికి ఇచ్చే అంశాన్ని టీఆర్ఎస్ నాయకత్వం సీరియస్‌గా పరిశీలించినట్టు ప్రచారం జరిగింది. ఇక గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉంటారనే ఊహాగానాలు వినిపించాయి.

రేవంత్ రెడ్డి ప్లాన్‌కు గండికొడుతున్న ఈటల రాజేందర్.. ఆ నేత విషయంలో..

Ghee: మీరు వాడే నెయ్యి మంచిదేనా ? కల్తీ జరిగిందో లేదో ఇలా తెలుసుకోండి

సిద్ధిపేట కలెక్టర్‌గా వ్యవహరించిన వెంకట్రామిరెడ్డి.. ఈ జిల్లా పరిధిలోకి వచ్చే సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ క్రమంలోనే పలుసార్లు సీఎం కేసీఆర్ బహిరంగ సభల్లోనే వెంకట్రామిరెడ్డిపై ప్రశంసలు కురిపించారు. దీంతో ఆయన ఎప్పటికైనా టీఆర్ఎస్‌లో చేరతారనే వార్తలు వినిపించయి. తాజాగా ఆయన తన ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేయడంతో.. ఆయనకు టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ పదవి ఖాయమైందనే ప్రచారం మొదలైంది.

First published:

Tags: CM KCR, Siddipet, Telangana

ఉత్తమ కథలు