‘నేను చచ్చిపోతేనే నీకు సంతృప్తా?’...ఆజంఖాన్ వ్యాఖ్యలపై జయప్రద ఆవేదన

ఆజంకు అసలు ఎన్నికల్లో పోటీ చేయనివ్వకూడదంటూ ఆరోపణలు చేశారు. అలాంటి వ్యక్తి గెలిస్తే.. ప్రజాస్వామ్యం ఏమవుతుంది? అంటూ ప్రశ్నించారామె.అలాంటి వ్యక్తి గెలిస్తే మహిళలకు ఏమాత్రం రక్షణ ఉండదన్నారు.

news18-telugu
Updated: April 15, 2019, 3:25 PM IST
‘నేను చచ్చిపోతేనే నీకు సంతృప్తా?’...ఆజంఖాన్ వ్యాఖ్యలపై జయప్రద ఆవేదన
జయప్రద
  • Share this:
యూపీలో రాజకీయాలు రంజుగా మారాయి. ఎన్నికలవేళ అధికార,ప్రతిపక్ష పార్టీలు దారుణ విమర్శలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జయప్రద,ఆజంఖాన్ మధ్య వివాదాస్పద రాజకీయం నడుస్తుంది. తాజాగా ఆజంఖాన్..జయప్రదపై మరోసారి నోరుపారేసుకున్నారు. దీనిపై స్పందించిన జయప్రద... ఆజంకు అసలు ఎన్నికల్లో పోటీ చేయనివ్వకూడదంటూ ఆరోపణలు చేశారు. అలాంటి వ్యక్తి గెలిస్తే.. ప్రజాస్వామ్యం ఏమవుతుంది? అంటూ ప్రశ్నించారామె.అలాంటి వ్యక్తి గెలిస్తే మహిళలకు ఏమాత్రం రక్షణ ఉండదన్నారు. నేను చనిపోతేనే నీకు సంతృప్తా అంటూ ...తనపై నీచంగా మాట్లాడుతున్న ఆజంఖాన్‌ను ప్రశ్నించారు జయప్రద. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఆజంఖాన్, బీజేపీ నుంచి జయప్రద ఈసారి రాంపూర్ పార్లమెంట్ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు.

ఈనేపథ్యంలో ఆజంఖాన్‌..జయప్రదపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. జయప్రదను తానే రాంపూర్‌కు తీసుకువచ్చానన్నారు. ఆమె శరీరాన్ని ఎవరూ తాకకుండా జాగ్రత్తలు తీసుకున్నానంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు.ఆజంఖాన్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఆజంఖాన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ వ్యాఖ్యానించారు. ఆయన మాటలు అవమానకరమైనవన్నారు. దీంతో ఆజంఖాన్‌కు నోటీసులు పంపించారు. మరోవైపు ఆయనపై రాంపూర్‌లో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

First published: April 15, 2019, 2:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading