జగన్, మంత్రుల్ని పిచ్చాసుపత్రిలో చేర్చాలి... టీడీపీ మహిళా నేత ఫైర్

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులను పిచ్చాసుపత్రిలో చేర్చాలని టీడీపీ మహిళా అధ్యక్షుడురాలు వి.అనిత మండిపడ్డారు.

news18-telugu
Updated: May 29, 2020, 4:38 PM IST
జగన్, మంత్రుల్ని పిచ్చాసుపత్రిలో చేర్చాలి... టీడీపీ మహిళా నేత ఫైర్
ఏపీ కేబినెట్ (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులను పిచ్చాసుపత్రిలో చేర్చాలని టీడీపీ మహిళా అధ్యక్షుడురాలు వి.అనిత మండిపడ్డారు. విశాఖలోని మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న నర్సీపట్నం డాక్టర్ సుధాకర్‌ను టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలసి ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా అనిత సీఎం జగన్ ప్రభుత్వం మీద మండిపడ్డారు. మానసిక వైద్యశాలకు తరలించాల్సింది సుధాకర్‌‌ను కాదని, జగన్‌ను చేర్చాలని అన్నారు. ఆస్పత్రిలో సుధాకర్‌కు ప్రాణహాని ఉందని అతడి తల్లి తనకు ఫోన్ చేసి చెప్పినట్టు అనిత తెలిపారు. అలాగే, డాక్టర్ సుధాకర్ కూడా తనకు ప్రాణహాని ఉందని చెబుతున్నట్టు అనిత వెల్లడించారు. కరోనా వైరస్‌ బాధితులకు చికిత్స చేసేందుకు కనీసం మాస్క్‌లు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ ప్రభుత్వం మీద విమర్శలు చేసి సస్పెన్షన్‌కు గురైన సుధాకర్‌కు ఆస్పత్రిలో చేర్చిన తర్వాత కూడా మాస్క్‌లు ఇవ్వడం లేదని అనిత మండిపడ్డారు. ఇక ఏపీ ఎస్ఈసీ రమేష్ కుమార్ తొలగింపు విషయంపై కూడా ఆమె స్పందించారు. జగన్‌కు హైకోర్టు నుంచి ఇది 65వ మొట్టికాయ అని ఎద్దేవా చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే అభిప్రాయంతో నిరంకుశంగా ముందుకు వెళితే ఇలాగే జరుగుతుందన్నారు.
First published: May 29, 2020, 4:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading