నన్ను ఎన్‌కౌంటర్ చేయండి... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు...

చంద్రబాబును అడ్డుకున్న పోలీసులను ఉద్దేశించి ఆయన తీవ్రంగా స్పందించారు. ‘షూట్ చేయండి. ఎన్‌కౌంటర్ చేయండి.’ అని వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: February 27, 2020, 4:00 PM IST
నన్ను ఎన్‌కౌంటర్ చేయండి... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు...
విశాఖ ఎయిర్‌పోర్టులో బైఠాయించిన చంద్రబాబు..
  • Share this:
విశాఖలో తన కాన్వాయ్ మీద కోడిగుడ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడి చేశారని, ఈ రోజు తనకు ఎదురైనే పరిస్థితే రేపు ప్రజలకు కూడా ఎదురవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విశాఖ, విజయనగరంలో పర్యటనకు అనుమతి తీసుకున్నా ఇప్పుడు ఎందుకు పోలీసులు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేస్తే చేసుకోండని, అయితే, ఏ చట్టం ప్రకారం అరెస్టు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విశాఖ, విజయనగరం పర్యటనకు అనుమతి తీసుకున్నా. వైసీపీ వాళ్లు డబ్బులిచ్చి మనుషులను తెచ్చి దాడికి ప్రయత్నించారు. కోడిగుడ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లు, ఒకరిద్దరు రాళ్లు కూడా విసిరారు. పోలీసులు అరగంట తర్వాత పంపిస్తామన్నారు. ఇప్పుడు విమానాశ్రయానికి వెళ్లమంటున్నారు. అరెస్ట్ చేస్తామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బెదిరిస్తున్నారు. మీరు అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి. కానీ, ఏ చట్టం ప్రకారమో ముందు నోటీసులు ఇవ్వండి’ అని చంద్రబాబు అన్నారు.

విశాఖ విమానాశ్రయంలో బైఠాయించిన చంద్రబాబు, టీడీపీ నేతలు


తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో 11 మంది ముఖ్యమంత్రులను చూశానని, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదన్నారు. విశాఖలో కూడా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవన్నారు. 14 ఏళ్ల సీఎం, 20 సంవత్సరాల పార్టీ అధినేత, 11 సంవత్సరాల ప్రతిపక్ష నేతగా ఉన్న తనకే ఇలా ఉంటే రేపు సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు అన్నారు. ‘వైసీపీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నా. గర్హిస్తున్నా.  పోలీసులు నాకు లెటర్ ఇస్తేనే కదులుతా.’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

నారా లోకేష్,చంద్రబాబు టూర్,చంద్రబాబుపై గుడ్లు దాడి,చంద్రబాబుపై చెప్పుల దాడి,విశాఖలో చంద్రబాబు టూర్,విశాఖ ఎయిర్పోర్టు చంద్రబాబు,విశాఖలో టీడీపీ వైసీపీ దాడులు,విశాఖలో చంద్రబాబుకు షాక్,ఉత్తరాంధ్రలో చంద్రబాబు యాత్ర,nara lokesh,nara lokesh on chandrababu tour,nara lokesh tweet,nara lokesh on ysrcp,nara lokesh on ys jagan,chandrababu in visakhapatnam
విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబు


అంతకు ముందు చంద్రబాబును అడ్డుకున్న పోలీసులను ఉద్దేశించి ఆయన తీవ్రంగా స్పందించారు. ‘నన్ను షూట్ చేయండి. ఎన్‌కౌంటర్ చేయండి.’ అని వ్యాఖ్యానించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: February 27, 2020, 3:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading