షాకింగ్ : ఢిల్లీలో బీజేపీ ఎంపీపై 'షూ' దాడి

shoe thrown at bjp mp gvl narasimharao : జీవీఎల్ మాత్రం ఈ దాడి వెనకాల కాంగ్రెస్ కుట్ర ఉందని ఆరోపించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నట్టు సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే దాడికి పాల్పడ్డాడా? లేక ఏదైనా రాజకీయ పార్టీతో అతనికి సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: April 18, 2019, 3:28 PM IST
షాకింగ్ : ఢిల్లీలో బీజేపీ ఎంపీపై 'షూ' దాడి
బీజేపీ ఎంపీ జీవీఎల్‌పై షూ దాడి..
news18-telugu
Updated: April 18, 2019, 3:28 PM IST
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావుపై ఓ వ్యక్తి 'షూ'తో దాడి చేశాడు. గురువారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయనపై దాడి జరిగింది. అనూహ్య ఘటనతో జీవీఎల్ షాక్ తిన్నారు. దాడి చేసిన వ్యక్తిని కాన్పూర్‌కి చెందిన శక్తి భార్గవ్‌ అనే వైద్యుడిగా గుర్తించారు. అయితే అతను జీవీఎల్‌పై షూతో ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందన్నది తెలియరాలేదు. మరోవైపు జీవీఎల్ మాత్రం ఈ దాడి వెనకాల కాంగ్రెస్ కుట్ర ఉందని ఆరోపించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నట్టు సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే దాడికి పాల్పడ్డాడా? లేక ఏదైనా రాజకీయ పార్టీతో అతనికి సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా, బీజేపీ భోపాల్ లోక్‌సభ అభ్యర్థిగా ప్రగ్యా సాధ్విని ప్రకటించాక.. ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి జీవీఎల్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రగ్యా సాధ్విని తమ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడంలో తప్పేం ఉందని ఆయన ప్రశ్నించారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీ హిందువులను బద్నాం చేసిందని విమర్శించారు. జీవీఎల్ ఇలా మాట్లాడుతున్న సందర్భంలోనే ఆయనపై శక్తి భార్గవ్ షూ విసిరారు. జీవీఎల్ వెంటనే తల పక్కకు తిప్పుకోవడంతో షూ వెనక్కి వెళ్లి పడింది.(దాడి చేసిన వ్యక్తి విజిటింగ్ కార్డ్..) 
First published: April 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...