Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి మిస్సింగ్ మిస్టరీలో షాకింగ్ ట్విస్ట్.. సంచలన నిజాలను వెల్లడించిన పోలీసులు

వైజాగ్ స్టీల్ ప్లాంట్, శ్రీనివాసరావు రాసిన సూసైడ్ లెటర్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి మిస్సింగ్ మిస్టరీలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి విచారణ చేసి పలు షాకింగ్ నిజాలను వెలుగులోకి తెచ్చారు. అతడి నిర్వాకాలను బయటపెట్టారు.

  • Share this:
    ‘ప్రియమైన కార్మిక సోదరుల్లారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈ రోజు జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలి. 32 మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం. ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వద్దు. నేను నా ప్రాణాన్ని ఈ ఉక్కు ఉద్యమం కొరకు త్యాగం చేస్తున్నాను. ఈ రోజు కొలమిలో అగ్నికి ఆహుతి కావడానికి 5:49 నిమషాలకు మూహుర్తం ఉంది కాబట్టి ఈ పోరాటం ప్రాణత్యాగం నా నుండి మొదలు కావాలి’.. ఇదీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు రాసిన సూసైడ్ లేఖ సారాంశం. ఆదివారం రాత్రి పది గంటల సమయంలో విధులకు హాజరయ్యాడు. ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ ప్లాంట్ లాగ్ బుక్ లో రాశాడు. ఆ తర్వాత మాయమైపోయాడు.

    అతడి అదృశ్యంపై విశాఖ స్టీల్ ప్లాంట్ లోనే కాదు, రాజకీయంగానూ కలకలం చెలరేగింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ప్రత్యేకంగా అతడి గురించి ఓ వీడియోను విడుదల చేశారు. ఎక్కడున్నా తిరిగి రావాలనీ, అందరం కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. తన టేబుల్ వద్ద ఐడీ కార్డు, పర్స్, ఫోను, సూసైడ్ లేఖను వదిలి శ్రీనివాసరావు అదృశ్యం కావడంతో స్టీల్ ప్లాంట్ లో కలకలం చెలరేగింది. అయితే అతడి అదృశ్యంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అసలేం జరిగిందన్నది ఆరా తీశారు. ఈ క్రమంలోనే కొన్ని సంచలన నిజాలను పోలీసులు వెలుగులోకి తెచ్చారు.
    ఇది కూడా చదవండి: శోభన్ బాబు చనిపోయిన రోజు అసలేం జరిగింది..? తండ్రితో మాట్లాడి కొడుకు బయటకు వెళ్లగానే..

    ‘శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ లో ఫోర్ మెన్ గా పనిచేస్తున్నాడు. అతడు ఆత్మహత్య చేసుకుంటానని ప్లాంట్ లాగ్ బుక్ లో రాశాడు. అయితే బ్లాస్ట్ ఫర్నేస్ లో పడి చనిపోవడం అసాధ్యం. ఉద్యోగాల పేరుతో ఇద్దరి వద్ద రూ.50 లక్షల రూపాయలను వసూలు చేశాడు. శనివారం ఉద్యోగ ప్రకటన వస్తుందని వారిని నమ్మించాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మరో 16 మందిని కూడా నమ్మించాడు. అయితే స్టీల్ ప్లాంట్ లో మాత్రం ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదు. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేశాం. దర్యాప్తు చేస్తున్నాం.‘ అని విశాఖ ఏసీపీ వెల్లడించారు. ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేశాడని పోలీసులు వెల్లడించడంతో కార్మికుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
    ఇది కూడా చదవండి: ‘ఆ శోభన్ బాబు చచ్చిపోయాడురా.. అనేవాడు.. ప్రతి నెలా నాకు రూ.10 లక్షలు.. అంతా ఆయన చలవే..’.. దర్శకుడు కోదండరామిరెడ్డి కామెంట్స్
    Published by:Hasaan Kandula
    First published: