SHOCKING PANCHAYAT ELECTION RESLUT FOR BALAKRISHNA IN HINDUPUR
AP Panchayat elections: బాలయ్య ఒక వైపే చూశారా..? హిందూపురంలో ఎందుకిలా జరిగింది?
Balakrishna Photo : Twitter
ఏపీ పంచాయతీ నాలుగో దశ ఫలితాలు బాలయ్యకు షాక్ ఇచ్చాయి. బాలయ్యతో పాటు హిందూపురం నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నేతల స్వగ్రామాల్లోనూ ప్రతికూల ఫలితాలే వచ్చాయి. దీంతో అసలు ఏం జరిగింది? ఫలితాలు ఎందుకిలా వచ్చాయన్నదానిపై బాలయ్య ఆరా తీస్తున్నట్టు సమాచారం.
నందమూరి నటసింహం బాలయ్య అడ్డాగా చెప్పుకునేది హిందూపురం. అక్కడ ఆయన ఎంత చెబితే అంత.. గత కొన్నేళ్లుగా తిరుగులేని మెజార్టీ సాధిస్తూ వస్తున్నారు. బాలకృష్ణ అంటే బట్టలు చింపుకునేంత వీరాభిమానులు అక్కడ ఉన్నారు. అలాంటి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆయనకు షాక్ ఇచ్చాయి..? ఎందుకిలా జరిగిందని బాలయ్య ఇప్పుడు నియోజకవర్గం నేతలను అడిగి ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో మాజీ సీఎం చంద్రబాబు స్వగ్రామం తరువాత అందరి ఫోకస్ హిందూపురంపైనే పడింది. అక్కడ బాలకృష్ణకు తిరుగలేదనే చెప్పాలి. దానికితోడు ఈ పంచాయతీ ఎన్నికలను ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎప్పటినుంచో ఆయన రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడూ నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టలేదనే విమర్శలు ఉన్నాయి. సినిమాల్లో బిజీగా ఉండే ఆయన హిందూపురం వైపు చూడకపోయినా.. అతడ్ని అక్కడ అభిమానులు గెలిపిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గానే కనిపిస్తున్నారు.
రాజకీయాల్లో బాలయ్య దూకుడు పెంచారు అనే చెప్పాలి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురంలో పంచాయతీ ఎన్నికల్లో నెగ్గి సెంటర్లో తొడగొట్టాలి అనుకున్నారు. అందుకే ఇటీవల అక్కడ పర్యటించారు కూడా.. రాజకీయ పరిణామాలు.. పంచాయతీ పోటీలపై ఆరా తీశారు. ఎలాగైనా గెలవాలని కేడర్ కు సూచించారు కూడా.. కానీ ఫలితాలు మాత్రం ఆయన అనుకున్నదానికి రివర్స్ లో వచ్చాయి. హిందూపురంలోని 38 స్థానాల్లో 30 చోట్ల తమదే విజయమని వైసీపీ అంటోంది. అయితే వైసీపీ రెబల్స్ ఎక్కువగా పోటీ చేయడం.. వారు అధికార పార్టీకి చెందిన ఓట్లు కాకుండా టీడీపీ మద్దతు దారుల ఓట్లే చీల్చరని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దానికి తోడు అధికార పార్టీ అరాచకాలు చేసి.. బలవంతంగా నెగ్గిందని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తనకు తిరుగులేదనకున్న హిందూపురంలో ఈ ఫలితాలు బాలయ్యకు షాక్ అనే చెప్పాలి.
అయనతో పాటు పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధికి షాక్ తగిలింది. ఆయన సొంత పంచాయతీ రొద్దంలో టీడీపీ ఘోరంగా ఓడింది. బీకే పార్థసారధి సొంత వార్డు మరువపల్లిలోనూ టీడీపీకి పరాభవం ఎదురైంది. అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు కూడా చేదు అనుభవం తప్పలేదు. నిమ్మల కిష్టప్ప సొంత పంచాయతీ వెంకటరమణపల్లిలో టీడీపీ ఓటమి చెందింది. మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు ఫలితాలు షాక్ ఇచ్చాయి. ఆయన సొంత పంచాయతీ మద్దనకుంటలో టీడీపీ మద్దతుదారలు ఓటమి పాలయ్యారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.