భయంతో షాకయ్యా.. ఇంత కిరాతకమా? నిరసిస్తే చంపేస్తారా? -Lakhimpur ఘటనపై TRS మంత్రి KTR భావోద్వేగం

లఖీంపూర్ హింసపై కేటీఆర్

TS minister KTR on Lakhimpur Kheri Violence : సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసిస్తోన్న రైతులను కేంద్ర మంత్రి కొడుకు కారుతో తొక్కి చంపిన ఘటనపై ఆందోళనలు ఇంకా తీవ్రతరం అయ్యాయి. యూపీలోని లఖీంపూర్ ఖేరీ జిల్లాలో చోటుచేసుకున్న అసాధారణ హింసపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లఖీంపూర్ హింసపై భావోద్వేగ ట్వీట్లు చేశారు. షాకింగ్ వీడియోను, హింసకు దారి తీసిన కేంద్ర మంత్రి ప్రసంగాన్ని సైతం కేటీఆర్ రీట్వీట్ చేశారు..

  • Share this:
ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ జిల్లాలో రైతులపై హత్యాకాండ జరిగి మూడు రోజులు కావొస్తున్నా పరిస్థితులు ఇంకా సర్దుమణగలేదు. పైగా, కొత్త గొంతుకలు సైతం నిరసన గళాన్ని విప్పుతున్నాయి. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్ లాంటి పార్టీలు నేరుగా కార్యక్షేత్రంలోనే ఆందోళనలకు దిగగా, టీఎంసీ, టీఆర్ఎస్ లాంటి పార్టీలు సోషల్ వేదికల ద్వారా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ మంత్రి, అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. లఖీంపూర్ ఘటనపై మంగళవారం నాడు వరుస ట్వీట్లు, రీట్వీట్లలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు..

లఖీంపూర్ జిల్లాలోని తికూనియా గ్రామంలో ఈనెల 3న(ఆదివారం) జరిగిన హింసలో ప్రధాన ముద్దాయిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిత్రా పాత్రను మరింత రూఢీ చేసే వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. మంత్రి కొడుకు లోపలున్న థార్ వాహనం.. రోడ్డుపై నిల్చున్న రైతుల్ని తొక్కించుకుంటూ వెళ్లిన దృశ్యాలు సంచలనంగా మారాయి. కొద్ది గంటలుగా సదరు వీడియో వైరలైంది. దాన్నే మంత్రి కేటీఆర్ సైతం రీట్వీట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు జోడించారు..‘ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ లో రైతులపై నిర్దాక్షిణ్యమైన రక్తపాతాన్ని చూసి షాక్ తోపాటు భయానికి గురయ్యాను. ఇంతటి అనాగరిక సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేరస్తులను చట్టం ముందుకు లాక్కురావాలి’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే, అక్టోబర్ 3 నాటి హింసకు దారి తీసిన ఘటనలను కూడా కేటీఆర్ ప్రస్తావించారు.కొద్ది రోజుల కిందట, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా అదే లఖీంపూర్ లో ఓ సభలో మాట్లాడుతూ.. నిరసనలు చేసే రైతుల అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చిన వీడియోను కూడా కేటీఆర్ రీట్వీట్ చేశారు.‘నిరసనలు చేస్తే రైతులకు బుద్ధి చెబుతం అని రైతులు చనిపోయే కొద్ది గంటల ముందు లఖీంపూర్ ఖీరిలో బీజేపీ కేంద్ర మంత్రి రైతులను ఉద్దేశించి హెచ్చరించారు’అని పేర్కొన్నారు.
Published by:Madhu Kota
First published: