• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • SHOCK TO REVANTH REDDY ON RYTHU RANABHERI IN VOTE FOR NOTE CASE BA

Revanth Reddy: రైతు రణభేరి సభ రోజే రేవంత్ రెడ్డికి ఊహించని షాక్.. ఓటుకు నోటు కేసులో..

Revanth Reddy: రైతు రణభేరి సభ రోజే రేవంత్ రెడ్డికి ఊహించని షాక్.. ఓటుకు నోటు కేసులో..

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

ఓ వైపు తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారధ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా రైతు రణభేరి మోగిస్తున్న రోజే తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది.

  • Share this:
    ఓ వైపు తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారధ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా రైతు రణభేరి మోగిస్తున్న రోజే తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఓటుకు నోటు కేసులో నిందితులపై అభియోగాల నమోదు చేసింది ఏసీబీ కోర్టు. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ పై అభియోగాలు నమోదు చేసింది ఏసీబీ కోర్టు. నిందితులపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 నమోదు చేసింది. రేవంత్ రెడ్డి, ఇతరులపై ఐపీసీ 120బి రెడ్ విత్ 34 అభియోగం నమోదు అయింది. తమపై అభియోగాల్లో నిజం లేదని రేవంత్, ఇతర నిందితులు తోసిపుచ్చారు. మరోవైపు సండ్ర వెంకటవీరయ్యపై గతంలోనే కోర్టు అభియోగాలు నమోదు చేసింది. ఈనెల (ఫిబ్రవరి) 19న సాక్షుల విచారణ షెడ్యూలు ఖరారు చేస్తామని చెప్పింది.

    కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా రైతు రణభేరి పేరుతో యాత్రలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఈ రోజు ముగుస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ శివారులోని రావిరాలలో రైతు రణభేరి సభను ఏర్పాటు చేశారు. ఈ సభ మీద కూడా కాంగ్రెస్ పార్టీలో అతర్గతంగా అసమ్మతి వ్యక్తం అయింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ల తీరుపై మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతిలేదని కాంగ్రెస్ సీనియర్ నేతలు అనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నది రైతుల కోసమని, అది జూనియర్లు, సీనియర్ల పంచాయతీ కాదన్నారు. రైతు మద్దతుదారులు ఎవరైనా ఈ సభకు రావొచ్చని పిలుపునిచ్చారు. కొందరు సీనియర్లు రేవంత్ సభకు రావద్దనడం తప్పు అని మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు.

    గతంలో టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం జరిగింది. కానీ, అది ఆగిపోయింది. మరోసారి టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ మొదలయ్యేలోపు తాను పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజల మద్దతు కూడగట్టాలని రేవంత్ రెడ్డి భావించారని.. ఈ కారణంగానే ఆయన పాదయాత్ర చేపట్టారని కొందరు చర్చించుకుంటున్నారు. తనకు ఎంతో పట్టున్న అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేయడం ద్వారా కాంగ్రెస్ నాయకత్వానికి ప్రజల్లో తన పట్ల ఉన్న సానుకూలతలను చూపించాలని ఆయన వ్యూహరచన చేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇతర నేతలు పాదయాత్ర చేపట్టే వరకు వేచి చూడకుండా ఈ విషయంలో తాను ముందు వెళ్లాలని రేవంత్ రెడ్డి భావించారని.. అందుకే పాదయాత్ర విషయంలో హఠాత్తుగా ముందుకు సాగిపోయారనే టాక్ కూడా కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. మొత్తానికి పాదయాత్ర ద్వారా తెలంగాణ రాజకీయాలతో పాటు కాంగ్రెస్ పార్టీలో తన ఇమేజ్ పెంచుకోవాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాలి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: