మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్...

గతంలో దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 23 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ బస్సుల పర్మిట్లను అధికారులు రద్దు చేశారు. తాజాగా ఐదు బస్సులను సీజ్ చేశారు.

news18-telugu
Updated: November 5, 2019, 5:29 PM IST
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్...
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే జేసీ బ్రదర్స్‌కు చెందిన బస్సులను సీజ్ చేశారు. తాజాగా దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన మరో ఐదు బస్సులను సీజ్ చేశారు. ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లు లేకపోవడంతో అధికారులు ఈ బస్సులను సీజ్ చేసినట్టు తెలిసింది. రవాణా శాఖ అధికారులు మంగళవారం జరిపిన తనిఖీల్లో ఐదు దివాకర్ ట్రావెల్స్ బస్సులు పట్టుబడ్డాయి. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లలో అక్రమాలు కారణంగా మొత్తం 36 బస్సులు.. 18 కాంట్రాక్టు బస్సులను అధికారులు సీజ్‌ చేసినట్టు సమాచారం.

గతంలో దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 23 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ బస్సుల పర్మిట్లను అధికారులు రద్దు చేశారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న బస్సులపై దాడులు చేసిన రవాణా శాఖ అధికారులు…. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారం టికెట్ల ధరలు వసూలు చేయడం వంటి అంశాలకు సంబంధించి దివాకర్ ట్రావెల్స్‌పై తమకు ఫిర్యాదు వచ్చాయని తెలిపారు.

పెట్రోల్ సీసాతో రావాలా?.. ఓ రైతు ఆగ్రహావేశం

First published: November 5, 2019, 5:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading