పవన్ కళ్యాణ్‌కు షాక్.. జనసేనకు మాజీ మంత్రి గుడ్‌బై?

వైఎస్‌తో కూడా బాలరాజుకు మంచి అనుబంధం ఉండేది. గిరిజన ప్రాంతాల్లో మంచి పేరు కూడా ఉంది. దీంతో బాలరాజు చేరికకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

news18-telugu
Updated: September 5, 2019, 5:06 PM IST
పవన్ కళ్యాణ్‌కు షాక్.. జనసేనకు మాజీ మంత్రి గుడ్‌బై?
పవన్ కళ్యాణ్, పసుపులేటి బాలరాజు (File)
news18-telugu
Updated: September 5, 2019, 5:06 PM IST
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జనసేన పార్టీకి పునరుజ్జీవం కల్పించేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. జనసేనను కిందిస్థాయి నుంచి బలోపేతం చేయాలని నిర్ణయించారు. దీని కోసం కొన్ని రోజుల క్రితం పార్టీలో కమిటీలను నియమించారు. అయితే, కిందిస్థాయి నుంచి బలోపేతం చేసే పని పక్కనపెడితే.. పార్టీలో ఉన్న అతి కొద్ది మంది నేతలు జనసేనను వీడే పరిస్థితి కనిపిస్తోంది. జనసేన నేత, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఆ పార్టీని వీడాలని నిశ్చయించుకున్నట్టు సమాచారం. గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా వ్యవహరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా సేవలు అందించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన జనసేన పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఎన్నికల తర్వాత అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం మరోసారి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రావాలని భావిస్తున్న బాలరాజు త్వరలో వైసీపీలో చేరాలని భావిస్తున్నట్టు సమాచారం. వైఎస్‌తో కూడా బాలరాజుకు మంచి అనుబంధం ఉండేది. గిరిజన ప్రాంతాల్లో మంచి పేరు కూడా ఉంది. దీంతో బాలరాజు చేరికకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

First published: September 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...