టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవందర్ రెడ్డికి ప్రగతి భవన్ ఎదుట షాక్ తగిలింది. ప్రగతి భవన్లో ఇవాళ గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పద్మా దేవెందర్ రెడ్డి ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. అయితే పోలీసులు మాత్రం ఆమెకు అందుకు అనుమతి ఇవ్వలేదు. కేవలం మంత్రులు, ఐఏస్, ఐపీఎస్ అధికారులకు మాత్రమే అనుమతి ఉందని... ఆమెను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో చేసేది ఏం లేక... పద్మా దేవందర్ రెడ్డి ఇంటికి వెనుదిరిగారు. అయితే ఎమ్మెల్యేలకు అనుమతి లేదని తెలిసిీ కూడా ఆమె ఎందుకు ప్రగతి భవన్‌కు వెళ్లారన్న దానిపై ఇప్పుడు తెలంగాణ రాజకీయ నేతల్లో హాట్ టాపిక్‌గా మారింది.