జగన్‌కు షాక్... వైసీపీకి సీనియర్ నేత రాజీనామా

పార్టీలో తనకు సరైన గౌరవం, ప్రాతినిధ్యం దక్కడం లేదని గత కొంతకాలంగా తన అనుచరుల ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: December 8, 2019, 10:16 AM IST
జగన్‌కు షాక్... వైసీపీకి సీనియర్ నేత రాజీనామా
సీఎం జగన్
  • Share this:
సీఎం జగన్ మోహన్ రెడ్డికి సొంత పార్టీలోనే తలనొప్పులు మొదలయ్యాయి. ఓ వైపు ఎంపీలు మరోవైపు ఎమ్మెల్యే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతున్నారు.   తాజాగా పార్టీ సీనియర్ నేత ఒకరు వైసీపీకి గుడ్ బై చెప్పారు.  ప్రకాశం జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ముద్దన తిరుపతి నాయుడు తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు.  డీసీఎంఎస్ చైర్మన్ పదవిని ఆశించిన ముద్దన, ఆ పదవిని రామనాథంకు ఇవ్వడంతో అలకబూని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

పార్టీలో తనకు సరైన గౌరవం, ప్రాతినిధ్యం దక్కడం లేదని గత కొంతకాలంగా తన అనుచరుల ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు ముద్దన. తాజాగా ఇప్పుడు ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికే పదవులు దక్కుతున్నాయని ఆరోపించిన ముద్దన, తన రాజకీయ భవిష్యత్తుపై అనుచరులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>