బెయిల్ పిటిషన్ తిరస్కరణ... తీహార్ జైలుకు చిదంబరం

మిగతా ఖైదీలకు ఉండే సదుపాయాలు మాత్రమే చిదంబరంకు ఉంటాయని .. పప్పు .. 4 చపాతీలు చిన్న బౌల్ లో ఇస్తామని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు.

news18-telugu
Updated: August 26, 2019, 12:36 PM IST
బెయిల్ పిటిషన్ తిరస్కరణ... తీహార్ జైలుకు చిదంబరం
చిదంబరం (File)
  • Share this:
సుప్రీంకోర్టు మరోసారి మాజీ కేంద్రమంత్రి చిదంంబరానికి షాక్ ఇచ్చింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిస్కరించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. సీబీఐ అరెస్ట్ విషయంలో తలదూర్చలేమని స్పష్టం చేసింది. చిదంబరం అరెస్ట్‌కు వ్యతిరేకంగా ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. చిదంబరంపై జరుగుతున్న విచారణ నిబంధనలకు విరుద్దంగా ఉందని మరో లాయర్ అభిషేక్ మనుసింఘ్వి వాదనాలు వినిపించారు. కానీ ఈ వాదనల్ని ధర్మాసనం తోసిపుచ్చింది. ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అయితే చిదంబరాన్ని తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఇప్పటివకకు ఐదురోజుల పాటు సీబీఐ కస్టడీలో చిదంబరాన్ని అధికారులు విచారించారు. మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కూడా కోర్టును కోరారు. అయితే దీనిపై ఇంకా న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.

మరోవైపు ఇవాళ సాయంత్రంతో చిదంబరం సీబీఐ కస్టడీ ముగియనుండటంతో ఆయనను తీహార్ జైలుకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జైల్లో అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు. తీహార్ జైల్లో కూడా ఇప్పటికే అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తిచేసినట్లు తెలుస్తోంది. తీహార్ జైలులో చిదంబరంకు సెల్ నెం. 7 ను కేటాయించబోతున్నారు. ఇందులో ఆర్ధిక నేరగాళ్లు ఉంటారు. మిగతా ఖైదీలకు ఉండే సదుపాయాలు మాత్రమే చిదంబరంకు ఉంటాయని .. పప్పు .. 4 చపాతీలు చిన్న బౌల్ లో ఇస్తామని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు. అతనికి సౌత్ ఇండియా ఫుడ్ కావాలంటే సెపరేట్ గా స్నాక్స్ అందుబాటులో ఉంచుతామని అది కూడా కోర్ట్ ఆర్డర్ ప్రకారమని చెబుతున్నారు. అలాగే జైల్లో చిదంబరంకు పరుపు లేకుండా ఉన్న మంచాన్ని ఇస్తామన్నారు. సీనియర్ సిటిజన్స్ కు మాత్రమే ఇటువంటివి ఏర్పాటు చేస్తారంట. మిగతా వారు అయితే కిందే పడుకోవాల్సిందేనని చెప్పారుFirst published: August 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు