చంద్రబాబుకు షాక్... టీడీఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా

ఈ భేటీకి గైర్హాజరైన ఐదుగురు ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీకి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే మరో 12మంది ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి రాలేదు.

news18-telugu
Updated: January 19, 2020, 4:54 PM IST
చంద్రబాబుకు షాక్... టీడీఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా
చంద్రబాబు
  • Share this:
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చారు. రేపటి అసెంబ్లీ సమావేశాలు నేపథ్యంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్సీ సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు. అయితే ఈ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేశ్, అశోక్, అనగాని భవాని హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాలతో సమావేశానికి రాలేకపోతున్నామని పార్టీకి సందేశం పంపారు. ఈ భేటీకి గైర్హాజరైన ఐదుగురు ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీకి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

అయితే మరో 12మంది ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి రాలేదు.  మండలిలో టీడీపీకి మొత్తం 32 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇవాల్టి సమావేశానికి 20 మంది ఎమ్మెల్సీ లు హాజరయ్యారు. దీంతో మండలి సంఖ్యా బలం పైనే టీడీపీ ఆశలు పెట్టుకుంది. మండలి సభ్యులను ప్రలోభ పెట్టె ప్రయత్నం జరుగుతుందని కొంతమంది ఎంఎల్సీలు ఆరోపిస్తున్నారు. ఎల్లుండి సభకు తమ పార్టీ ఎమ్మెల్సీ లు అంతా హాజరవుతారు అంటున్న టీడీఎల్పీ సమావేశంలో తెలిపారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున, పార్టీ ఆదేశానుసారం ఓటేయాలని టీడీపీ ఎమ్మెల్యేలకు ఇప్పటికే విప్ జారీ చేసింది. విప్ పరిధిలోకి రెబెల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలను కూడా తీసుకువచ్చారు. విప్ కు విరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణిస్తామని పార్టీ హైకమాండ్ నేతలకు ఆదేశించింది. అయితే... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీఎల్పీ భేటీకి రాకపోవడం పట్ల చంద్రబాబులో కాస్త ఆందోళన మొదలయ్యింది.

First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు