చంద్రబాబు సొంతూరులో వైసీపీ భారీ సభ... టీడీపీలో టెన్షన్

నారావారిపల్లెలోని చంద్రబాబు నివాసానికి సమీపంలోనే వైసీపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది.

news18-telugu
Updated: February 1, 2020, 7:00 PM IST
చంద్రబాబు సొంతూరులో వైసీపీ భారీ సభ... టీడీపీలో టెన్షన్
చంద్రబాబు, వైఎస్ జగన్ (File)
  • Share this:
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ పర్యటిస్తున్నారు టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు. దీనికి కౌంటర్‌గా ఇతర ప్రాంతాల్లో మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు, సభలు ఏర్పాటు చేస్తోంది వైసీపీ. ఈ క్రమంలోనే టీడీపీకి మరో ఝలక్ ఇచ్చేందుకు అధికార పార్టీ సిద్ధమవుతోంది. ఏకంగా చంద్రబాబు సొంతూరైన చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో మూడు రాజధానులకు మద్దతుగా సభ నిర్వహించనుంది వైసీపీ. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. నారావారిపల్లెలోని చంద్రబాబు నివాసానికి సమీపంలోనే ఈ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు.

ప్రజా సదస్సుగా నామకరణం చేసిన ఈ సభకు వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డితో పాటు ఏడుగురు మంత్రులు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. మూడు రాజధానుల వల్ల కలిగే ప్రయోజనాలు సభలో వివరించనున్న వైసీపీ... చంద్రబాబు సొంతూరు ప్రజలే ఇందుకు మద్దతు తెలుపుతున్నారనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా నారావారిపల్లెలో భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నారావారిపల్లెలో థ్యాంక్యూ సీఎం అంటూ జగన్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అధికార పార్టీ ఏర్పాటు చేస్తున్న ఈ సభ టీడీపీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తోంది.

First published: February 1, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు