ఏపీ మంత్రికి షాక్... సమీక్షకు అధికారులు దూరం

ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

కొద్దిరోజులుగా ఏపీ ప్రభుత్వం, ఉన్నతాధికారుల మధ్య ఎన్నికల కోడ్‌కు సంబంధించి వివాదం నడుస్తున్న నేపథ్యంలో... మంత్రి సోమిరెడ్డి సమీక్ష వివాదం దీనికి మరింత ఆజ్యం పోసినట్టయ్యింది.

  • Share this:
    ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. కరవు, అకాల వర్షాలపై సమీక్ష చేయాలని నిర్ణయించిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి... ఇందుకు సంబంధించి ఈ నెల 24నే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అందుకు తగ్గట్టుగా ఈ రోజు ఉదయం సచివాలయానికి వచ్చిన మంత్రి సోమిరెడ్డి... మూడు గంటలకు పైగా అధికారుల కోసం ఎదురుచూశారు. అయితే అధికారులు, ఉద్యోగులు ఎవరూ ఈ సమీక్షకు హాజరుకాలేదు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో తాము సమీక్షకు హాజరుకాలేమని వారు పరోక్షంగా సమాచారం పంపించారని తెలుస్తోంది. దీనిపై మంత్రి సోమిరెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.

    కొద్దిరోజులుగా ఏపీ ప్రభుత్వం, ఉన్నతాధికారుల మధ్య ఎన్నికల కోడ్‌కు సంబంధించి వివాదం నడుస్తున్న నేపథ్యంలో... మంత్రి సోమిరెడ్డి సమీక్ష వివాదం దీనికి మరింత ఆజ్యం పోసినట్టయ్యింది. ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం సమీక్షలు నిర్వహించబోద్దని ఈసీ స్పష్టం చేయగా... వేరే రాష్ట్రాలు, కేంద్రంలో లేని నిబంధనలు ఇక్కడే ఎలా అమలు చేస్తారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఓ అడుగు ముందుకేసిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి... అధికారులు సమీక్షకు రాకపోతే తాను సుప్రీంకోర్టుకు వెళతానని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన నిర్వహించిన సమీక్షకు అధికారులు, ఉద్యోగులు రాకపోవడంతో... ముందుగా ప్రకటించనట్టుగానే ఆయన దీనిపై సుప్రీంకోర్టు వరకు వెళతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

    First published: