కేంద్రంలో మళ్లీ ఎన్డీఏదే అధికారమంటున్న శివసేన

ఢిల్లీ వేదికగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షతో దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణల్లో మార్పు రాబోతోందా? మోదీ మరోసారి ప్రధాని అయ్యే అవకాశాలు తగ్గిపోయాయా? ఇప్పుడివే ప్రశ్నలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. కానీ, బీజేపీ మిత్రపక్షం శివసేన మాత్రం మళ్లీ అధికారంలోకి వచ్చే ఎన్డీఏ ప్రభుత్వమేనంటోంది.

news18-telugu
Updated: February 13, 2019, 10:08 PM IST
కేంద్రంలో మళ్లీ ఎన్డీఏదే అధికారమంటున్న శివసేన
ఉద్దవ్ థాక్రే, నరేంద్ర మోదీ ఫైల్ ఫోటో
news18-telugu
Updated: February 13, 2019, 10:08 PM IST
ఢిల్లీ వేదికగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షతో దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణల్లో మార్పు రాబోతోందా? మోదీ మరోసారి ప్రధాని అయ్యే అవకాశాలు తగ్గిపోయాయా? ఇప్పుడివే ప్రశ్నలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. కానీ, బీజేపీ మిత్రపక్షం శివసేన మాత్రం మళ్లీ అధికారంలోకి వచ్చే ఎన్డీఏ ప్రభుత్వమేనంటోంది. ఇన్నాళ్లూ బీజేపీపై కస్సుబుస్సులాడిన మిత్రపక్షం శివసేన.. మరోసారి కమలానికి దగ్గరవుతున్నట్టుగా అనిపిస్తోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎంపీ ఆనంద్‌రావు ఆడ్సుల్ చేసిన వ్యాఖ్యలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరోసారి కేంద్రంలో ఎన్డీఏ నేతృత్వంలోని ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారాయన. పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయనిపిస్తోందని చెప్పారు.

తాజాగా హస్తిన వేదికగా కేంద్రం తీరును నిరసిస్తూ చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు.. దాదాపుగా బీజేపీయేతర పక్షాలన్నీ సంఘీబావం తెలిపాయి. బీజేపీ మిత్రపక్షంగా పిలువబడే శివసేన ప్రతినిధులు సైతం చంద్రబాబు దీక్షకు మద్దతు తెలిపారు. అయితే,  మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని శివసేన ఎంపీ ఆనంద్‌రావ్ ఆడ్సుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి మంచి మెజార్టీతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వస్తుందని తాము భావిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

అటు, చివరి పార్లమెంట్ సమావేశాల్లో ప్రసంగించిన టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి సైతం మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు. మరోవైపు, బీజేడీ ఎంపీ బీ మెహతాబ్, తృణముల్ ఎంపీ సుదీప్ బంద్యోపాధ్యాయలు స్పీకర్ సుమిత్రా మహాజన్ పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందంటూ శివసేన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

First published: February 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...