ఎంపీపై కత్తితో దాడి.. ఎన్నికల ప్రచారంలో తీవ్ర కలకలం

చేతి మణికట్టు వాచీకి కత్తి గుచ్చుకోవడంతో ప్రమాదం తప్పింది. ఎంపీపై దాడిచేసిన వ్యక్తిని శివసేన కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

news18-telugu
Updated: October 16, 2019, 3:56 PM IST
ఎంపీపై కత్తితో దాడి.. ఎన్నికల ప్రచారంలో తీవ్ర కలకలం
ఘటనా స్థలంలో కత్తి
  • Share this:
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో తీవ్ర కలకలం రేగింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న శివసేన ఎంపీ ఓంరాజే నీమ్‌బాల్కర్‌పై కత్తిదాడి జరిగింది. ర్యాలీలో ఓం రాజే ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దూసుకొచ్చి కత్తితో దాడి చేశాడు. షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లు నటించిన ఆయన చేతిపై కత్తిని దింపాడు. అనంతరం వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. కలంబ్ తాలుకా పడోలి నయ్‌గావ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎంపీ ఓమ్ రాజేకు స్వల్ప గాయమైంది. చేతి మణికట్టు వాచీకి కత్తి గుచ్చుకోవడంతో ప్రమాదం తప్పింది. ఎంపీపై దాడిచేసిన వ్యక్తిని శివసేన కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాగా, ఓంరాజే నీమ్‌బాల్కర్‌ తండ్రి కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎంపీగా పనిచేశారు. 2006 జూన్ 3న పవన్ రాజే దారుణ హత్యకు గురయ్యారు. కాలంబోలి ప్రాంతంలో పుణె-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై తుపాకీతో ఆయన్ను కాల్చి చంపారు. పవన్ రాజే హత్య కేసులో మాజీ ఎంపీ పదమ్‌సిన్హ్ పాటిల్ నిందితుడిగా ఉన్నారు.

First published: October 16, 2019, 3:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading