జగన్‌పై కోడికత్తి తరహాలో.. ఆ ఎంపీపై దాడి..

ఓమ్‌రాజే నీంబాల్కర్ తండ్రి పవన్ రాజే నీంబాల్కర్ కాంగ్రెస్ నాయకుడు. 2006లో ఆయన హత్యకు గురయ్యారు.

news18-telugu
Updated: October 16, 2019, 3:48 PM IST
జగన్‌పై కోడికత్తి తరహాలో.. ఆ ఎంపీపై దాడి..
శివసేన ఎంపీపై దాడి
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కోడికత్తితో దాడి జరిగినట్టే.. మహారాష్ట్రలో ఓ ఎంపీ మీద కూడా దాడి జరిగింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా శివసేన ఎంపీ మీద ఈ దాడి జరిగింది. ఉస్మానాబాద్ లోక్‌సభ ఎంపీ ఓమ్‌రాజే నీంబాల్కర్ కలంబ్ తాలూకాలోని పడోలీ నాయిగావ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆ సమయంలో కొందరు యువకులతో కలసి ఓ వ్యక్తి ఎంపీ వద్దకు వచ్చాడు. షేక్ హ్యాండ్ ఇవ్వాలని కోరాడు. ఎన్నికల సమయంలో ఇలాంటివన్నీ సహజం కావడంతో ఎంపీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అంతలోనే ఆ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టే ఇచ్చి.. వెంటనే చిన్న కత్తితో అతడి మణికట్టు మీద పొడిచి పరారయ్యాడు. ఎంపీ వెంట ఉన్న కార్యకర్తలు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. చిన్న కత్తితో పొడవడంతో పెద్దగా గాయం కాలేదని పోలీసులు తెలిపారు. దీంతోపాటు ఆ కత్తిపోటు ఎంపీ పెట్టుకున్న వాచీకి తగిలింది. ఆ తర్వాత చేతికి తగిలింది. వాచీ ఉండడం వల్ల పెద్ద గాయం కాలేదు.

ఓమ్‌రాజే నీంబాల్కర్ తండ్రి పవన్ రాజే నీంబాల్కర్ కాంగ్రెస్ నాయకుడు. 2006లో ఆయన హత్యకు గురయ్యారు. ముంబై - పూణె ఎక్స్‌ప్రెస్ వే మీద కారులో ఉండగా కొందరు దుండగులు ఆయన్ను హత్య చేశారు. ఈ కేసులో మాజీ ఎంపీ పదమ్ సిన్హ్ పాటిల్ నిందితుడు.

First published: October 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు