ఉద్దవ్ థాక్రే ప్రమాణస్వీకారవేళ.. పార్టీని వీడిన కీలక నేత..

సిద్దాంతాలను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి తన మనసు ఒప్పుకోవట్లేదని.. అందుకే శివసేన నుంచి తప్పుకుంటున్నానని ట్విట్టర్ ద్వారా రమేష్ సోలంకి వెల్లడించారు.

news18-telugu
Updated: November 28, 2019, 7:15 AM IST
ఉద్దవ్ థాక్రే ప్రమాణస్వీకారవేళ.. పార్టీని వీడిన కీలక నేత..
ఉద్దవ్ థాక్రేతో రమేష్ సోలంకి
  • Share this:
శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే మరికొన్ని గంటల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నవేళ..ఆ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు తప్పుకున్నారు. శివసేన విద్యార్థి విభాగం జాతీయ విద్యార్థి సేన(బీవీఎస్)లో కీలకంగా వ్యవహరిస్తున్న రమేష్ సోలంకి తన పదవికి రాజీనామా చేశారు. సిద్దాంతాలను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి తన మనసు ఒప్పుకోవట్లేదని.. అందుకే శివసేన నుంచి తప్పుకుంటున్నానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శివసేన నుంచి తప్పుకోవడం తీవ్రంగా బాధిస్తోందని.. అయితే తానెప్పటికీ బాలాసాహెబ్ శివసైనిక్‌గా మిగిలిపోతానని స్పష్టం చేశారు.ఇన్నాళ్లు శివసేనలో పనిచేసే అవకాశం కల్పించినందుకు పార్టీ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.కాగా,ఈరోజు సాయంత్రం 6.40గంటలకు ముంబై దాదర్‌లోని శివాజీ పార్కులో ఉద్దవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. ఉద్దవ్ ప్రమాణస్వీకారానికి బీజేపీకి చెందిన ముఖ్య నేతలను కూడా ఆహ్వానించారు.



Published by: Srinivas Mittapalli
First published: November 28, 2019, 7:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading